వ్యాపారము

కొత్త కారు కొనేవాళ్లకు శుభవార్త.. రూ.లక్షన్నర తగ్గింపు..?

Hyundai Discounts April 2021

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన హ్యూందాయ్ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు శుభవార్త చెప్పింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. గత కొన్ని నెలల నుంచి కంపెనీ కార్లు ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు జరుపుకుంటుండటంతో ఇదే జోరును కొనసాగించాలని భావిస్తున్న హ్యూందాయ్ కంపెనీ పలు మోడళ్లపై భారీగా డిస్కౌంట్లను ప్రకటించడం గమనార్హం.

హ్యూందాయ్ కంపెనీ పాపులర్ కారు శాంట్రో‌ మోడల్‌ పై ఏకంగా 20,000 రూపాయల క్యాష్ డిస్కౌంట్ ను అందిస్తోంది. ఈ కారు కొనుగోలుపై ఎక్స్చేంజ్ బోనస్ కింద మరో 10 వేల రూపాయలు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. కార్పొరేట్ డిస్కౌంట్ కింద మరో 5,000 రూపాయల వరకు తగ్గింపును పొందవచ్చు. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌ కొనుగోలుపై క్యాష్ డిస్కౌంట్ రూపంలోనే 30,000 రూపాయల తగ్గింపును పొందవచ్చు.

ఎక్స్చేంజ్ బోనస్ కింద 10వేల రూపాయలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద 5వేల రూపాయల వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. ఐ20 మోడల్ కారు కొనుగోలుపై ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ కింద 15,000 రూపాయలు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది. హ్యుందాయ్ కోన ఎలక్ట్రిక్ కారుపై ఏకంగా లక్షన్నర రూపాయల వరకు తగ్గింపు లభించడంతో పాటు హ్యుందాయ్ ఎక్సెంట్ ప్రైమ్ కారుపై 50 వేల రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.

కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వాళ్లు వెంటనే హ్యూందాయ్ కారును కొనుగోలు చేస్తే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. సమీపంలోని హ్యూందాయ్ షోరూమ్ ను సంప్రదించడం ద్వారా డిస్కౌంట్ కు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Back to top button