జనరల్ప్రత్యేకం

కారు కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్షన్నర రూపాయల తగ్గింపు..?

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలలో ఒకటైన హ్యుందాయ్ సంస్థ కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకునే వారికి శుభవార్త చెప్పింది. కారు కొనాలనుకునే వారి కోసం అదిరిపోయే ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కొనుగోలుపై హ్యుందాయ్ సంస్థ ఏకంగా లక్షన్నర రూపాయల తగ్గింపు ప్రయోజనాలను అందిస్తూ ఉండటం గమనార్హం. ఉద్యోగులు కార్ల కొనుగోలుపై ప్రత్యేక డిస్కౌంట్ ను పొందవచ్చు.

ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్షెషన్ వోచర్లను వినియోగించుకునే అవకాశం ఉండగా మెడికల్ ప్రొఫెషనల్స్, కార్పొరేట్స్, ఎస్ఎంఈలు, టీచర్లు, సీఏలకు స్పెషల్ ఆఫర్లు ఉన్నాయని సమాచారం. హ్యుందాయ్ కోనా కారు కొనుగోలుపై గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. హ్యూందాయ్ ఎలంట్రా కారు కొనుగోలుపై లక్ష రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.

హ్యూందాయ్ ఆరా కారును కొనుగోలు చేస్తే 70 వేల రూపాయల వరకు డిస్కౌంట్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది. గ్రాండ్ ఐ10 నియోస్ కారు కొనుగోలుపై 60 వేల రూపాయలు, హ్యందాయ్ శాంట్రో కారు కొనుగోలుపై రూ.50 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు. సమీపంలోని హ్యూందాయ్ షోరూంను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ ఆఫర్ల వల్ల ప్రయోజనం చేకూరుతుంది.

కారు కొనుగోలుపై భారీగా తగ్గింపు బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉండటంతో ఉద్యోగులకు ఈ ఆఫర్ల వల్ల మరిన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందే అవకాశం ఉంటుంది.

Back to top button