టాలీవుడ్సినిమా

స్పీడున్నోడు.. స్పీడు పెంచాడు..


ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేశ్‌ బాబు కుమారుడిగా ఈజీగానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌. తండ్రి, అన్న గణేష్‌ బాబు ప్రొడ్యూస్‌ చేసిన అల్లుడు శీను మూవీతో తెరంగేట్రం చేశాడు. వీవీ వినాయక్‌ లాంటి స్టార్ డైరెక్టర్, అప్పటికే టాప్‌ ప్లేస్‌లో ఉన్న సమంత హీరోయిన్‌.. ఫుల్‌ క్రేజ్‌ ఉన్న దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్.. 40 కోట్ల బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా తన కుమారుడు గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చేలా చూసుకున్నాడు సురేశ్‌. మూవీ కూడా ఫర్వాలేదనిపించింది. ఆ మూవీ వచ్చింది 2014లో అయితే ఈ ఆరేళ్లలో సాయి శ్రీనివాస్‌ కేవలం ఏడు సినిమాలే చేయగలిగాడు. అందులో హిట్ల కంటే ఫెయిల్యూర్సే ఎక్కువ. కథ, కథనం పరంగా అతని లాస్ట్ మూవీ రాక్షసుడు బాగానే ఉన్నా సరైన పబ్లిసిటీ లేక ఎక్కువ కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. బ్యాక్‌గ్రౌండ్‌ బాగానే ఉన్నా.. సక్సెస్‌ ట్రాక్‌ మాత్రం కనిపించకపోవడంతో ఈ యువ కథనాయకుడు ఇప్పుడు స్పీడు పెంచాడు. సీత, రాక్షసుడు సినిమాలతో వైవిధ్యం ఉన్న కథల వైపు వచ్చిన సాయి ఇప్పుడు ‘అల్లుడు అదుర్స్‌’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్టైనర్గా తెరకెక్కబోయే ఈ మూవీకి అవినాశ్‌ కొల్ల డైరెక్టర్. జి. సుబ్రమణ్యం ప్రొడ్యూసర్కాగా.. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్. ఇస్మార్ట్‌ బ్యూటీ నభా నటేష్‌ హీరోయిన్‌గా ఎంపికైంది. గతేడాదే మూవీకి కొబ్బరి కాయ కొట్టారు. కరోనా కారణంగా షూటింగ్‌ ఆగిపోయింది.

Also Read: రష్మిక మైండ్ కరాబు చేస్తున్న హీరో

అల్లుడు అదుర్స్‌ ట్రాక్‌పై ఉండగానే సాయి శ్రీనివాస్‌ మరో రెండు మూవీస్‌కు ఓకే చెప్పాడు. లాక్‌డౌన్‌ బ్రేక్‌లో పలు కథలు విన్న సాయి…వెంట వెంటనే సినిమాలు చేయాలని డిసైడ్‌ అయ్యాడు. దాంతో, స్వామి రారా ఫేమ్‌ సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్కు ఓకే చెప్పాడు. ఈ మూవీ ఈఏడాది చివర్లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అంతేకాదు తనకు మంచి పేరు తెచ్చిన రాక్షసుడు మూవీకి సీక్వెల్‌ తీయబోతున్నట్టు కూడా ప్రకటించాడు. దీనికి రమేశ్‌ వర్మనే డైరెక్టర్గా వ్యవహరిస్తాడని సాయి వెల్లడించాడు. ఇదే కాదు ఇంకో కొత్త దర్శకుడితో ఓ చిత్రం చేసేందుకు కూడా బెల్లంకొండ సాయి రెడీ అయ్యాడు. ఇప్పటికే కథ విన్నానని, వచ్చే ఏడాది ఈ మూవీని ప్రకటిస్తామని చెప్పాడు. ఇది వరకు స్పీడున్నోడు టైటిల్‌తో ఓ సినిమా తీసిన సాయి మూవీస్‌ విషయంలో స్పీడైతే పెంచాడు గానీ.. అదే స్పీడులో అతనికి సక్సెస్‌ వస్తుందో లేదో చూడాలి.

Tags
Back to top button
Close
Close