టాలీవుడ్సినిమా

‘చెక్’ సినిమా టికెట్ బ్లాక్ లో కొన్నాను.. రిలీజ్ కోసం వెయిటింగ్ః రాజ‌మౌళి

Rajamouli
నితిన్ హీరోగా.. రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం చెక్. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు చంద్రశేఖర్ ఏలేటి తెర‌కెక్కించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ మూవీ ఫిబ్రవరి 26న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైద‌రాబాద్ లో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించింది. ఈ వేడుక‌కు దర్శక ధీరుడు రాజమౌళి, మెగాప్రిన్స్‌ వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకులు గొపీచంద్ మలినేని, వెంకీ కుడుములతోపాటు సాయిచంద్, మిర్చి సంపత్ పాల్గొన్నారు.

Also Read: 50 ఏళ్ల వయసులో బిడ్డను కన్న స్టార్ హీరోయిన్

ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రాజమౌళి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ చిత్రానికి సంబంధించిన తొలి టికెట్‌ను వరుణ్ తేజ్ తో క‌లిసి రాజమౌళి కొనుగోలు చేశారు. అనంత‌రం జ‌క్క‌న్న మాట్లాడుతూ.. చెక్ సినిమా టికెట్ బ్లాక్‌లో కొన్నాన‌ని చెప్ప‌డంతో వేదిక‌పై న‌వ్వులు విర‌బూశాయి. రాజ‌మౌళి త‌న ప్ర‌సంగాన్ని కొన‌సాగిస్తూ…

‘‘చాలా రోజుల తర్వాత థియేటర్‌కు వెళ్లి చూడాలని ఫీలైన చిత్రం చెక్. ఈ సినిమా కాన్సెప్ట్ అలా ఉంది. ‘చెక్’ సినిమాలో చెస్ కథను నేపథ్యంగా తీసుకోవడం, సినిమా అంతా జైలులోనే తీయడం ఇంట్రెస్ట్ కలిగించింది. ఈ సినిమా క్లాస్, మాస్ అనే హద్దులను చెరిపేస్తుంది. వైవిధ్యమైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని చాలా బలంగా నమ్ముతున్నాను’’ అని అన్నారు రాజమౌళి.

Also Read: థియేటర్లో ‘ఆ నలుగురు!’.. మ‌రి, ద‌మ్ము చూపిందెవ‌రో తెలుసా..?

హీరో నితిన్ గురించి మాట్లాడుతూ… ‘‘నితిన్ ఒకే రకమైన సినిమాల్లో నటిస్తారనే వాదనను మరిపిస్తూ.. చాలా కష్టపడి వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఎలాంటి సినిమాల్లోనైనా నటిస్తారనే పేరు తెచ్చుకొన్నారు. చెక్ సినిమాతో మరోసారి నితిన్ పెర్ఫార్మెన్స్ పరంగా నిరూపించుకొంటారని అనుకొంటున్నాను.’’ అని చెప్పారు దర్శకధీరుడు.

ఈ సినిమా మ్యూజిక్ గురించి కూడా తన స్పందన తెలియజేశారు రాజమౌళి ‘‘ఈ సినిమాలో ఒక్క పాటను మాత్రమే విన్నాను. కల్యాణీ మాలిక్ అద్భుతంగా మ్యూజిక్ ఇచ్చారు. ఆ ఒక్క పాట ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకువెళ్లేలా ఉంది. ఇప్పుడు ఈ వేడుకలో అందరి మాటలు విన్న తర్వాత చెక్ సినిమాకు కల్యాణీ మాలిక్ మంచి మ్యూజిక్ ఇచ్చారని అర్థమైంది. ఫిబ్రవరి 26న విడుదలయ్యే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను’’ అని అన్నారు రాజమౌళి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button