అత్యంత ప్రజాదరణవైరల్సినిమా

కోట్లు మోసపోయాను..వాళ్లే ముంచారు: రాజేంద్రప్రసాద్

I cheated crores of rupees .. They cheated: Rajendra Prasad

రాజేంద్రప్రసాద్.. టాలీవుడ్ లోనే ఒకప్పుడు గొప్ప కామెడీ హీరో. ఆయన సినిమాలు ఇప్పటికీ కూడా ఎంతో వినోదాన్ని పంచుతాయి. తరతమ బేధాలు లేకుండా అందరికీ రాజేంద్రప్రసాద్ అంటే పిచ్చి ప్రేమ, అభిమానం. ఆయన సినిమాలు వస్తున్నాయంటే అందరూ టీవీల ముందు అతుక్కుపోతుంటారు.

అలాంటి రాజేంద్రప్రసాద్ కూడా మోసపోయాడు. నటుడిగా ఎంతో ఎత్తుకు ఎదిగి బ్లాక్ బస్టర్ మూవీలు చేసి సినిమా ఇండస్ట్రీలో సంపాదించిన సొమ్మునంతా సొంత వాళ్ల చేతిలో మోసపోయాడట.. ఈ విషయాన్ని ఆయనే చెప్పుకొని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాధపడ్డాడు.

టాలీవుడ్ లో చాలా మంది నటులు కోట్లు సంపాదించినా వాటిని ఎలా మేనేజ్ చేయాలో తెలియక దగ్గరి వాళ్లకు ఇచ్చి నిండా మునిగినవారున్నారు. ఒక సావిత్రి నుంచి మొదలు పెడితే నేటి పూరిజగన్నాథ్ వరకు కోట్లు పోగొట్టుకున్నారు. ఇప్పుడు అదే కోవలో రాజేంద్రప్రసాద్ కూడా చేరారు.

తన అనుకున్న వాళ్ల దగ్గరే డబ్బు విషయంలో తాను మోసపోవడం ఆవేదన కలిగించిందని రాజేంద్రప్రసాద్ అన్నారు. తాను ఇంతకాలం సంపాదించిన సొమ్ము ఏమైందని చూసుకుంటే నిజాలు తెలిసి వేదన మిగిలిందన్నారు.

దగ్గరివాళ్ల చేతిలో తాను మోసపోయాననే చేదు నిజం తెలిసివచ్చిందన్నారు. అప్పటికే మోసం చేసిన వాళ్లు వెళ్లిపోయారని రాజేంద్రప్రసాద్ తన ఆవేదనను వెళ్లగక్కారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి. రాజేంద్రప్రసాద్ ను ముంచిన ఆ దగ్గరి వాళ్లు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది.

Back to top button