టాలీవుడ్సినిమా

Akhil Akkineni: ఇలాంటి క్షణాల కోసమే బతుకుతాను – అఖిల్

Akhil Akkineni

షార్ప్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో అఖిల్ హీరోగా రానున్న సినిమా ‘ఏజెంట్’. ఈ సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఏజెంట్ షూటింగ్ గ్యాప్ లో సురేందర్ రెడ్డి – అఖిల్ పచ్చని ప్రకృతిలో మమైక పోయి కథా చర్చలు చేస్తున్నారు. అయితే, ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ మాట్లాడుకుంటూ ఉండగా టీమ్ మెంబర్ వీరి ఫోటో తీశాడు.

కాగా ఆ ఫొటోను అఖిల్‌ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. పైగా ఫొటోతో పాటు ఒక ఇంట్రెస్టింగ్ మెసేజ్ చేస్తూ.. ‘నేను ఇలాంటి క్షణాల కోసమే బతుకుతాను’ అంటూ అఖిల్ పోస్ట్ చేయడం విశేషం. అఖిల్ ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడు. తన నరాలు కూడా ఎముకలు లాగా బలంగా లావుగా కనిపించేంతగా అఖిల్ ఈ సినిమా కోసం జిమ్ లో భారీ వర్కౌట్స్ చేశాడు.

View this post on Instagram

A post shared by Akhil Akkineni (@akkineniakhil)

అఖిల్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో ఆ మధ్య ఫస్ట్ లుక్ లో అఖిల్ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఆ లుక్ లో కండలు తిరిగిన దేహంతో అఖిల్ మరీ వైల్డ్ గా కనిపించాడు. మరి అఖిల్ కష్టానికి తగ్గట్టు ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి. పైగా ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెడుతున్నారు. అఖిల్ మార్కెట్ స్థాయి కంటే రెట్టింపు పెట్టుబడి పెడుతున్నారు.

అయితే, మెగాస్టార్ తో వందల కోట్ల బడ్జెట్ తో సైరా తీసిన సురేందర్ రెడ్డి ఆ సినిమా నిర్మాతకు భారీ నష్టాలను మిగిల్చాడు. మరి ఇప్పుడు అఖిల్ తో కూడా సురేందర్ రెడ్డి భారీ బడ్జెట్ ను పెట్టిస్తున్నాడు. మరి ఈ బడ్జెట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రానున్న డిసెంబర్ 24 కి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.

Back to top button