వ్యాపారము

గ్యాస్ సిలిండర్ యూజర్లకు శుభవార్త.. బ్యాంక్ బంపర్ ఆఫర్..?

దేశంలో గ్యాస్ సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 900 రూపాయలుగా ఉంది. గత కొన్ని నెలలుగా ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కొత్తగా గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడం ద్వారా అమెజాన్ పే గిఫ్ట్ కార్డ్ ను పొందవచ్చు.

అయితే జులై 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండటంతో ఐసీఐసీఐ ఐ మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గ్యాస్ సిలిండర్ చెల్లింపుతో పాటు ఇతర బిల్లుల చెల్లింపు చేయడం ద్వారా ఈ ఆఫర్ కు అర్హత పొందాలంటే కొన్ని షరతులు ఉన్నాయి. అయితే ఈ వోచర్ ను పొందాలని అనుకుంటే కొన్ని షరతులు ఉన్నాయి. ప్రతిరోజు మూడు బిల్లులు చెల్లించే వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

ఈ నెల చివరి వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉండటంతో పాటు ఒక కస్టమర్ గరిష్టంగా ఒక వోచర్ ను పొందే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు మూడు బిల్లులను చెల్లించే తొలి 300 మంది మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది. దేశంలో కోట్ల సంఖ్యలో గ్యాస్ వినియోగదారులు ఉండగా ఈ ఆఫర్ వల్ల కస్టమర్లకు భారీగా ప్రయోజనం చేకూరే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

ఈ ఆఫర్ తో పాటు పలు ప్రముఖ డిజిటల్ వాలెట్ సంస్థలు కూడా గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై కొన్ని ఆఫర్లను ప్రకటించాయి. ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఎక్కువ మొత్తంలో ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది.

Back to top button