తెలంగాణమిర్చి మసాలారాజకీయాలు

కోమటిరెడ్డి మంచి స్పీడ్ మీద ఉన్నాడుగా!

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచి స్పీడ్ మీద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఆయన ఢిల్లీ వెళ్ళి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసి వచ్చిన దగ్గర నుండి పెద్ద-పెద్ద కబుర్లు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఆయనకే ఇవ్వబోతున్నట్లు సమాచారం అందుకున్న కోమటిరెడ్డి మాటల స్పీడ్ పెంచారు.

విషయం ఏమిటంటే.. ఆయనకి పిసిసి అధ్యక్ష పదవి వచ్చిన వెంటనే టిఆర్ఎస్ కు చెందిన ఏభై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్త టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒక ఆంగ్ల పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాకుండా ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పదవి వచ్చాక పాదయాత్రలు, బస్ యాత్రలు వంటివాటిని చేపట్టి ,నిత్యం ప్రజలతోనే ఉంటానని ఆయన అన్నారు .కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి తేవడం తమ లక్ష్యమని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలను ప్రజలలోకి తీసుకు వెళతామని ఆయన చెప్పారు.

అయితే పదవి వచ్చాక ప్రజాల్లోనే ఉంటా అనడం, అప్పుడే టిఆర్ఎస్ అక్రమాలు బయటపెడతా అనడం, అన్నిటికీ మించి ఆయన పిసిసి అద్యక్షుడు అయితే టిఆర్ఎస్ ఎమ్ఎల్యేలు ఏభై మంది కాంగ్రెస్ లో చేరతారు అనడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలు.