కరోనా వైరస్లైఫ్‌స్టైల్

కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..?

 

సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలలో కరోనా లక్షణాలు కనిపిస్తే వాళ్లను అనేక ప్రశ్నలు వేధిస్తున్నాయి. కరోనాకు ఇంట్లో ఉండి చికిత్స చేయించుకుంటే సరిపోతుందా..? కరోనా సోకితే తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాలా..? అనే సందేహం కరోనా నిర్ధారణ అయిన వాళ్లను వెంటాడుతోంది. కరోనా నిర్ధారణ అయిన వెంటనే భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు.

లక్షణలు కనిపించిన వెంటనే వైద్యుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. ఏ కరోనా లక్షణం కనిపించినా వెంటనే పరీక్షలు చేయించుకుంటే మంచిది. కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు మందులు వాడుతూ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. కరోనా సోకిన వాళ్లలో దాదాపు అందరిలో ఊపిరితిత్తుల సమస్య ఎక్కువగా కనిపిస్తుండటం గమనార్హం.

కరోనా సోకిన తరువాత పల్స్ ఆక్సీమీటర్ ను తప్పనిసరిగా కొనుగోలు చేయాలి. పల్స్ రేట్ 100 కంటే ఎక్కువగా ఉన్నా ఆక్సిజన్ శాతం 95 శాతం కంటే తక్కువగా ఉన్నా కచ్చితంగా అనుమానించాల్సిందే. పాజిటివ్ వచ్చిన తరువాత దగ్గు, జలుబు 5,6 రోజులైనా తగ్గకపోతే సీటీస్కాన్ చేయించుకుంటే మంచిది. కరోనా పరిస్థితుల్లో నిర్లక్ష్యం ఏమాత్రం సరికాదని వైద్య నిపుణులు వెల్లడిస్తూ ఉండటం గమనార్హం.

వైద్యుల అందుబాటు, సేవల గురించి కచ్చితంగా అవగాహనను కలిగి ఉండాలి. వైద్యుల సలహాల ప్రకారం పరీక్షలు చేయించుకుంటే తక్కువ సమయంలోనే కరోనా వైరస్ నుంచి సులభంగా కోలుకోవడం సాధ్యమవుతుంది.

Back to top button