విద్య / ఉద్యోగాలు

పదో తరగతి అర్హతతో ఉద్యోగ ఖాళీలు.. ఎలా దరఖాస్తు చేయాలంటే..?

IGCAR Recruitment 2021

ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పదో తరగతి నుంచి పీహెచ్డీ చదివిన వారికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తోంది. స్టైఫండరీ ట్రైనీ, వర్క్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, టెక్నీషియన్ సైంటిఫిక్ ఆఫీసర్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ గార్డ్, క్యాంటీన్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 15వ తేదీన ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

మొత్తం 337 ఉద్యోగాలలో స్టైపండరీ ట్రైనీ, టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్), టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ ఆఫీసర్, క్యాంటీన్ అటెండెంట్, వర్క్ అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టేనో గ్రాఫర్ గ్రేడ్ 3, టెక్నీషియన్ బీ(క్రేన్ ఆపరేటర్) ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డిప్లొమో లేదా బీఎస్సీ చేసిన వాళ్లు స్టైపండరీ ట్రైనీ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టేనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు పదో తరగతి పాసైన వాళ్లు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వాళ్లు ఇంగ్లీష్ లో 80 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలిగే సామర్థ్యం ఉండాలి. అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లిష్ లో 30 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్ ఉండటంతో పాటు అభ్యర్థులు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. డ్రైవర్ ఉద్యోగాలకు పదో తరగతి అర్హతతో పాటు మూడేళ్ల అనుభవం ఉండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెక్యూరిటీ గార్డ్, వర్క్ అసిస్టెంట్, క్యాంటీన్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పదో తరగతి పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే నెల 14వ తేదీ లోపు igcar.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Back to top button