టాలీవుడ్సినిమా

ముసలోడితో ఇలియానా పెళ్లి !

ileana d'cruz
గోవా సుంద‌రి ఇలియానా త్వరలో పెళ్లి చేసుకోబోతుందని సమాచారం. నిజానికి ఎప్పుడో నాలుగేళ్ళ క్రితమే ఈ గోవా బ్యూటీ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, ఎందుకో సినిమాలు దూరమైపోయినా ఇంకా ఇల్లి పాప సింగిల్ గానే మిగిలిపోయింది. ప్రస్తుతం తెలుగుతో పాటు బాలీవుడ్‌ కు కూడా దూర‌మైన ఈ సొగసైన అమ్మ‌డు ప్ర‌స్తుతం పెళ్లి కోసం తనకు తగిన సంబంధాలు చూస్తోంది. తన సినీ జీవితంలో చాలా కష్టాలు పడ్డాను అని, అందుకే తన వ్య‌క్తిగ‌త జీవితాన్నైనా సంతృప్తిగా గ‌డ‌పాల‌ని నిర్ణయించుకున్నాను అని ఆ మధ్య చెప్పింది ఇలియానా.

అందులో భాగంగానే తన మనసుకు నచ్చిన ప్రియుడు ఆండ్రూను వివాహం చేసుకోకుండానే.. అతనితో సహజీవనం చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ ఫొటోగ్రాఫ‌ర్‌తో ఇలియానా వ్యవహారం చాలా కాలం సాగింది. ప్రేమాయ‌ణం అయితే సాగించింది గాని, అతనితో తన ప్రేమబంధాన్ని మాత్రం మధ్యలోనే ఫుల్ స్టాప్ పెట్టేసింది. నిజానికి ఇలియానా – ఆండ్రూల పెళ్లికి ఇరు కుటుంబాల వారు సుముఖ‌త‌ వ్య‌క్తం చేశారు. పైగా ఆండ్రూ స్వ‌స్థ‌లం ఆస్ట్రేలియాలో వీరి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది అని అప్పట్లో పుకార్లు వచ్చాయి. అలాగే ఇలియానా త్వరలో తల్లి కాబోతోంది అని కూడా వార్తలు వచ్చాయంటే.. ఆండ్రూతో ఆమె సాగించిన ప్రేమ వ్యవహారం ఎంత ఘాటుగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.

కానీ ఆ తరువాత ఏమి జరిగిందో గానీ, అతని ప్రేమకు దూరం జరిగి, అతనికి ఇలియానా గుడ్ బాయ్ చెప్పింది. ఆ తరువాత మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఛాన్స్ ల కోసం డైరెక్టర్ల చుట్టూ తిరిగి కొన్ని సినిమాలను అయితే పట్టుకుంది. కాకపోతే ఇలియానా సెకండ్ ఇన్నింగ్స్ అంత గొప్పగా ఏమి సాగలేదు. దాంతో ప్రస్తుతం సినిమాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తోంది. ఈ ఖాళీ సమయంలోనే ఇలియానా ఓ బిజినెస్ మెన్ తో ప్రేమలో విహరించిందని.. ఆ ప్రేమే మొత్తానికి పెళ్లికి దారి తీసింది అని.. కాకపోతే గోవాలోనే ప్రముఖ బిజినెస్ మెన్ అయిన అతను వయసులో చాలా పెద్దవాడు అని, పైగా ఇప్పటికే అతనికి పెళ్లి కూడా అయిందని.. అయినా ఇలియానా ప్రేమ కోసం ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆ బిజినెస్ మెన్ రెడీగా ఉన్నాడని తెలుస్తోంది. ఇలియానా కూడా ఆ బిజినెస్ మెన్ పట్ల ఆసక్తి చూపిస్తోందట.

Back to top button