టాలీవుడ్సినిమా

నన్ను ఎన్నిసార్లు గర్భవతిని చేస్తారు – ఇలియానా

Ileana

సినిమా అంటేనే రంగుల కలల ప్రపంచం. అందుకే ఆ కలల్లో పుకార్లే ఎక్కువుగా వస్తుంటాయి. ముఖ్యంగా హీరోయిన్లు ఆ పుకార్లు వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. కానీ అలాంటి పుకార్లు పుంఖానుపుంఖాలుగా వస్తున్నా.. తన ముందే తోటి నటులు కామెంట్లు చేస్తున్నా.. ఎన్నడూ దేనికి చలించలేదు ఇలియానా. కానీ ఒకే ఒక్క రూమర్ కి మాత్రం ఆమె మనసు బాధ పడింది. ఇప్పటికీ ఆమె మనసు ఆ విషయంలో చితికిపోతూ ఉంటుందట.

ఇంతకీ ఆ రూమర్ ఏమిటంటే.. హీరోయిన్ ఇలియానా గర్భవతి అంటూ వచ్చిన న్యూస్. నిజానికి ఈ వార్త ఒక్కసారి వచ్చింది కాదు, ఇలియానా కెరీర్ లో ఎన్నోసార్లు వచ్చింది. వచ్చిన ప్రతిసారి ఆ పుకారునే పదేపదే తల్చుకుంటూ బాగా షేమ్ గా ఫీలయ్యేది ఇలియానా. అసలు ఇలా ఎలా వార్తలు పుట్టిస్తారు ? ఒక మహిళ తన జీవితంలో పెళ్లి కాకుండా గర్భవతి అవ్వడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తోంది. నిజమే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉంటాయి.

వాటిన్నంటిని భరిస్తూ సహిస్తూ ఉంటేనే ఎదుగుతాం. అంత మాత్రాన నీచమైన పుకార్లు ఎలా పుట్టిస్తారు. అలాంటి ఫేక్ రూమర్లు నన్ను గతంలో అనేకసార్లు చాలా మానసిక వేదనకి గురి చేశాయి. నిజం చెప్పాలంటే నేనెప్పుడూ ఏ రూమర్ కి బాధ పడలేదు. ఎంతోమంది హీరోలతో నాకు అక్రమ సంబంధం ఉందని రాసేవాళ్ళు. అయినా నేను పట్టించుకోలేదు. కానీ, నేను గర్భవతిని అంటూ చేసిన దుష్ప్రచారానికి మాత్రం నేను ఇప్పటికీ బాధ పడుతున్నాను.

ఆ వార్త నన్ను ఇంకా ఇబ్బంది పెడుతుంది” అంటూ ఇలియానా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుని బాధ పడింది. అదేంటో గాని ఇలియానా తెలుగులో లీడింగ్ హీరోయిన్ గా ఉన్నప్పటి నుండే ఆమె గర్భవతి అంటూ ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ కి పోయి అవకాశాలు కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. ఆమెను ఎందుకు హీరోయిన్ గా తీసుకుంటున్నారు,

ఆమె గర్భవతి కదా అంటూ ఇలియానా పై ఎప్పటికప్పుడు రూమర్లు పుట్టించేవారు. ఇక ప్రస్తుతం ఇలియానా హిందీలో వెబ్ సిరీస్ లు, అడపాదడపా చిన్నాచితకా సినిమాలు చేస్తూ.. తన పై వచ్చే రూమర్లకు వివరణ ఇవ్వలేక ఇలా లోలోపలే చితికిపోతూ ఉంది. అయినా ఎన్నిసార్లు ఆమె గర్భవతి అని చెబుతారు.

Back to top button