టాలీవుడ్సినిమా

మెగాస్టార్ స్థాయి అత‌డికి మాత్ర‌మే.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన శ‌ర్వా!

Sharwanand
యంగ్ హీరో శ‌ర్వానంద్ లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11వ తేదీన ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలో సోమ‌వారం ఖ‌మ్మంలో ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సందర్భంగా శ‌ర్వానంద్ సినిమా విశేషాల‌తోపాటు చిరంజీవి గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడారు.

Also Read: కోట్లు మోసపోయాను..వాళ్లే ముంచారు: రాజేంద్రప్రసాద్

శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ త‌న మొద‌టి సినిమా అనీ, తాను చ‌విచూసిన ఫ‌స్ట్ స‌క్సెస్ కూడా అదే అని అన్నారు శ‌ర్వా. ఆ చిత్రంలో త‌న‌కో పాత్ర ఇచ్చి, త‌న విజ‌యానికి మెగాస్టార్ శ్రీకారం చుట్టార‌ని అన్నారు. ఇప్పుడు ఈ సినిమా ఫంక్ష‌న్ కు రావ‌డానికి ఒప్పుకున్నార‌ని, చిరు రాక‌తోనే ఈ మూవీ స‌క్సెస్ అయ్యింద‌ని భావిస్తున్నాన‌న్నారు.

నా బాస్ చిరంజీవి అంటే నాకు భ‌యం.. ఆయ‌న ముందు ఎప్పుడూ మాట్లాడ‌లేద‌ని అన్నారు శ‌ర్వా. ఈ సంద‌ర్భంగా గ‌తంలో చిరు చెప్పిన మాట‌ను గుర్తు చేసుకున్నారు. ‘నీ సంకల్పం గొప్పదైతే.. అదే నీ తలరాతను మారుస్తుంది’ అని చిరంజీవి చెప్పారని, ఆ మాటలు నాగుండెల్లో చిర‌స్థాయిగా నిలిచిపోయాయ‌ని అన్నార‌ను. ప్ర‌తిరోజూ షూటింగ్ కు వెళ్లే ముందు వాటిని గుర్తు చేసుకుంటాన‌ని చెప్పారు.

Also Read: హిట్ వస్తే ఇగోలు ఉండవ్.. క్రేజీ కాంబినేషన్ మళ్ళీ !

ఇక‌, త‌న మిత్రుడు రామ్ చ‌ర‌ణ్ గురించి మాట్లాడుతూ.. మెగాస్టార్ క్యారెక్ట‌ర్ తోపాటు సినీ వార‌స‌త్వం కూడా రామ్ చ‌ర‌ణ్ కు వ‌చ్చింద‌న్నారు శ‌ర్వా. ఆ స్థాయి రామ్ చ‌ర‌ణ్ కే వ‌చ్చింద‌ని, ఇంకెవ్వ‌రికీ ఆ వార‌స‌త్వం ద‌క్క‌దు అని అన్నారు. తాను చిరంజీవితోపాటు, మిత్రుడు రామ్ చ‌ర‌ణ్ కు జీవితాంతం రుణ‌ప‌డి ఉంటాన‌ని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button