టాలీవుడ్సినిమా

ఫోన్‌ చేస్తే వచ్చేస్తా అంటున్న తెలుగు హీరోయిన్


తెలుగు తెరపై అచ్చ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడమే అరుదు. ఒకవేళ వచ్చినా సక్సెస్‌ సాధించిన వాళ్లను వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఆ జాబితాలో చేరబోతున్న తెలుగమ్మాయి రీతూ వర్మ. ‘బాద్‌ షా’లో చిన్న పాత్రతో టాలీవుడ్‌కు పరిచమైన ఆమె..‘ఎవే సుబ్రమణ్యం’లో ఓ హీరోయిన్‌గా నటించింది. అయితే, ‘పెళ్లి చూపులు’తో టాలీవుడ్‌పై తనదైన ముద్ర వేసింది. ఆ తర్వాత నిఖిల్‌ సరసన ‘కేశవ’లో మెప్పించింది. అయితే, సరైన బ్రేక్‌ రాకపోవడంతో కోలీవుడ్‌ వైపు దృష్టి పెట్టింది. దుల్కర్ సల్మాన్‌ సరసన నటించిన ఆమె గౌతమ్‌ మేనన్- చియాన్‌ విక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ‘ధ్రువ నక్షత్రం’లో చాన్స్‌ కొట్టేసింది. అదే టైమ్‌లో తెలుగులోనూ ఆమె రెండు క్రేజీ ఆఫర్లు సొంతం చేసుకుంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

నాని సరసన ‘టక్‌ జగదీశ్‌’లో నటిస్తున్న ఆమె.. మరో యువ హీరో శర్వానంద్‌తో తెలుగు, తమిళ్‌లో విడుదల కాకున్న ఇంకో సినిమా చేస్తోంది. ఈ రెండు సినిమాల చిత్రీకరణ లాక్‌డౌన్‌ కారణంగా ఆగిపోయింది. ఇప్పుడు షూటింగ్స్‌ స్టార్ట్‌ కావడంతో తన చిత్రాల గురించి చిత్రీకరణ గురించి ఆమె ఆలోచిస్తోంది. చిత్ర యూనిట్స్‌ నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు రావాలా అని ఆత్రుతగా ఉన్నానని రీతూ అంటోంది. అయితే, హైదరాబాద్‌లో కరోనా వైరస్‌ ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడే షూటింగ్స్‌ మొదలు పెట్టకుండా ఉంటేనే మంచిదని అభిప్రాయపడింది. కానీ, మొదలు పెడదామని తన దర్శక, నిర్మాతలు నిర్ణయిస్తే మాత్రం తానూ సరేనంటానని చెప్పింది. వాళ్లు ఫోన్‌ చేస్తే వెంటనే షూటింగ్‌ స్పాట్‌ కు వచ్చేస్తానని అంటోంది.

Back to top button