ప్రవాస భారతీయులు

Immigration services: తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్ సేవలు

Immigration services for Telugu people

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఇమ్మిగ్రేషన్ ఫోరం ఏర్పాటు చేసి సేవలను విస్తృతం చేయాలని యోచిస్తున్నట్లు తానా అధ్యక్షుడు లావు అంజయ్య చౌదరి పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ రైతు కోసం సేవల్ని మరింత విస్తరిస్తాం, అంతర్జాతీయంగా తెలుగు సంఘాల భాగస్వామ్యంతో వచ్చే ఏడాది కూడా ప్రపంచ తెలుగు సాంస్కృతిక మహాత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. టెలిమెడిసిన్ ద్వారా భారతదేశంలోని తెలుగు వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని వివరించారు. కృష్ణా జిల్లా పెదఅవుటపల్లికి చెందిన అంజయ్య చౌదరి 2011 నుంచి తానాలో వివిధ పదవులతో పాటు రెండు దఫాలుగా తానా టీం స్వ్కేర్ ( తానా విపత్కర విభాగ సేవా సంస్థ ) ఛైర్మన్ గా పని చేశారు.

Back to top button