సినిమా

అవినాష్ కు ఇమ్యూనిటీ.. అదిరిపోయిన బిగ్ బాస్ ట్విస్ట్..!

Avinash

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ షోకు ఉన్న క్రేజ్ మరే కార్యక్రమానికి లేదంటే అతిశయోక్తి కాదేమో. బుల్లితెరపై బిగ్ బాస్ తన నెంబర్ వన్ స్థానాన్ని కాపాడుకునేందుకు కరోనాను కూడా లెక్కచేయకుండా షోను నిర్వహిస్తున్నారు. అయితే గత సీజన్లకు భిన్నంగా నాలుగో సీజన్ కొనసాగుతోంది. బిగ్ బాస్-4 ప్రారంభ ఎపిపోడ్ కు అదిరిపోయే టీఆర్పీ వచ్చింది. అయితే దానిని నిర్వాహకులు నిలబెట్టుకోలేక చతికిలపడుతున్నారు.

Also Read: భారీ బడ్జెట్ లోనూ ప్రభాసే నెంబర్ వన్ !

ప్రస్తుతం బిగ్ బాస్-4 ప్రస్తుతం 12వ వారంలో కొనసాగుతోంది. ఈ సీజన్ ముగింపు దశకు చేరుకుండటంతో గేమ్ రసవత్తరంగా మారుతోంది. దీంతో ప్రేక్షకులు బిగ్ బాస్ ను చూసేందుకు మరింత ఆసక్తిని చూపుతున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్-4లో దెత్తడి హరిక.. మొనాల్ గజ్జర్.. అరియానా.. అభిజిత్.. అఖిల్.. అరియానా.. అవినాష్ మాత్రమే మిగిలి ఉన్నారు. వీరి మధ్యే తీవ్రమైన పోటీ నెలకొంది.

ఈ ఏడుగురిలో బిగ్ బాస్ విన్నర్ ఎవరా? అనేది ఆసక్తి మొదలైంది. 12వ వారంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లకు షాకుల మీదు షాకులు ఇస్తున్నాడు. టోపి టాస్కుతో ఇంటి సభ్యులను నామినేషన్లలో ఇరికించిన బిగ్‌బాస్ ఆ తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి స్వాపింగ్ ను తెరపైకి తీసుకొచ్చాడు. అయితే మంగళవారం ఇంటి సభ్యులకు బంపరాఫర్ ఇచ్చాడు. ఆ గేమ్‌లో గెలిచిన వారికి ఇమ్యూనిటీ లభిస్తుందని ప్రకటించాడు.

Also Read: అక్కినేని ఫ్యామిలీలో.. అక్కినేని యష్ !

ఈ గేములో భాగంగా కంటెస్టెంట్లు ఇంటిలోని పలు ప్రాంతాల్లో దాచి ఉన్న జెండాలను సేకరించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువగా సేకరిస్తారో వారికే ఇమ్యునిటీ లభిస్తుంది. ఈ గేమ్‌ ప్రారంభం కాగానే మోనాల్.. అఖిల్.. అవినాష్.. అరియానా పరుగులు పెట్టి జెండాలను సేకరించే పనిలో పడ్డారు. మోనాల్‌కు హారిక.. అభిజిత్ మద్దతుగా నిలువగా అఖిల్‌కు సోహెల్ అండగా నిలిచాడు. అయితే అందరీ కంటే ఎక్కువగా అవినాష్ జెండాలు సేకరించడంతో అతడికి ఇమ్యునిటీ లభించినట్లు తెలుస్తోంది.

ఒకవేళ అనినాష్ ఈ వారం ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటే మాత్రం అతడికి వచ్చే నామినేషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. తనకు దక్కిని ఇమ్యూనిటీ పవర్ తో వచ్చే వారం అతడు సేఫ్ కానున్నాడు. ఇది జరిగితే అతడు మరో మూడు వారాలపాటు బిగ్ బాస్ లో కొనసాగడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో అతడు టాప్-5లోకి వెళ్లనున్నారు. అలా కాకుండా అనినాష్ ఈ వారం ఎలిమినేట్ అయితే మాత్రం అతడికి దక్కిన ఇమ్యూనిటీ వృథా అవడమేకాకుండా బిగ్ బాస్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. మొత్తంగా బిగ్ బాస్ ట్వీస్ట్ ఈ వారం అదిరిపోయేలా కన్పిస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button