ఆరోగ్యం/జీవనం

గోధుమ గడ్డితో లక్షల్లో ఆదాయం సంపాదించే ఛాన్స్.. ఎలా అంటే..?

ఈ మధ్య కాలంలో గోధుమ గడ్డి జ్యూస్ బాగా ప్రాచుర్యం పొందిందనే సంగతి తెలిసిందే. రోజూ గోధుమ గడ్డి జ్యూస్ ను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో గోధుమ గడ్డి జ్యూస్ తోడ్పడుతుంది. నిపుణులు సైతం గోధుమ గడ్డి జ్యూస్ తాగాలని సూచనలు చేస్తున్నారు. టాబ్లెట్, పొడి రూపంలో గోధుమ గడ్డి లభించే అవకాశం ఉంటుంది.

ఇంట్లోనే కుండీలో కూడా గోధుమ గడ్డిని పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. పరగడుపున 30ఎం.ఎల్ గోధుమ గడ్డి జ్యూస్ ను తాగితే ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. గోధుమలను విత్తిన తర్వాత ఆరు నుంచి ఎనిమిది అంగుళాల పొడవైన గడ్డిని తీసుకుని దాని నుంచి రసాన్ని తీస్తారు. గోధుమ గడ్డి వల్ల శరీరానికి అవసరమైన సెలీనియం, జింక్, ఐరన్ ,ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, సి, ఇ, మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయెడిన్ లభించే అవకాశం ఉంటుంది.

గోధుమ గడ్డి దొరకని వాళ్లు గోధుమ గడ్డి పొడిని వినియోగించి జ్యూస్ ను తయారు చేసుకుంటున్నారు. రక్తహీనతను పోగొట్టడంలో గోధుమ గడ్డి జ్యూస్ సహాయపడుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ పేగులోని అల్సర్ మంటను తగ్గించడంతో పాటు జీర్ణక్రియ, అధిక బరువు నియంత్రణలో ఎంతగానో సహాయపడుతుంది. గోధుమ గడ్డి జ్యూస్ లాభసాటి వ్యాపారంగా మారగడంతో చాలామంది ఇంట్లో గోధుమ గడ్డిని పెంచుతున్నారు.

నాణ్యమైన గోధుమలను నీళ్లలో నానబెట్టి కాటన్ వస్త్రంలో చుట్టి ఉంచితే రెండురోజుల్లో మొలకలు వచ్చే అవకాశం ఉంటుంది. మొలకలు వచ్చిన గోధుమలను మట్టితో నింపిన ట్రేలలో చల్లుకొని నీడ ప్రదేశంలో ఉంచితే మంచిది. రోజూ తగినంత నీటిని చిలకరిస్తే 10 రోజుల్లో గడ్డి 8 అంగుళాలకు పెరిగే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ గడ్డిని కోసి రెండు రోజులు నీడలో ఆరబెట్టాలి.

గోధుమ గడ్డి డ్రై అయిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ తయారు చేస్తే ఆ పౌడర్ ను కిరాణా షాపులలో, మెడికల్ షాపులలో విక్రయించవచ్చు. కిలో గోధుమ గడ్డి పౌడర్ 1500 రూపాయలు పలుకుతోంది. తక్కువ ఖర్చుతో గోధుమ గడ్డి పెంపకం చేపట్టి సులభంగా లక్షలు సంపాదించే అవకాశం అయితే ఉంటుంది.

Back to top button