రాజకీయాలువ్యాపారము

కేంద్రం శుభవార్త.. వాళ్లందరికీ పన్ను మినహాయింపు?

Income tax exemption to continue on salary income by NRIs

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ గల్ఫ్ కార్మికులకు శుభవార్త చెప్పింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు చేస్తూ ఎన్.ఆర్.ఐలు సంపాదిస్తున్న వేతనాల విషయంలో పన్ను మినహాయింపు కొనసాగుతుందని వెల్లడించింది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలలో ఒకరైన మహుమోయిత్రా గల్ఫ్ లోని భారత్ కార్మికులపై కేంద్రం అదనపు పన్ను విధించనున్నట్టు సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు.

Also Read: రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు మోదీ సర్కార్ శుభవార్త?

అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ చేసిన ఆరోపణల గురించి నిర్మలా సీతారామన్ స్పందించి గల్ఫ్ కార్మికుల ప్రత్యేక పన్ను విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదని పేర్కొన్నారు. గల్ఫ్ దేశాలలో పని చేస్తున్న భారత కార్మికుల విషయంలో కొత్తగా ఎటువంటి ఆదాయపు పన్నును ప్రవేశపెట్టలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. గల్ఫ్ దేశాల్లో పని చేస్తున్న కార్మికులు అదనపు పన్ను గురించి వస్తున్న వార్తల వల్ల టెన్షన్ పడుతుండగా నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చి వాళ్లకు ప్రయోజనం చేకూర్చారు.

గల్ఫ్ దేశాలలో పని చేసే భారత కార్మికులకు సంబంధించిన పన్ను విషయంలో ఎటువంటి మార్పులు లేవని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కార్మికుల వేతనాలకు సంబంధించి పన్ను మినహాయింపు కొనసాగుతుందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. తృణమూల్ కాంగెస్ ఎంపీ చేసిన ట్వీట్లు ప్రజల్లో అనవసర భయాందోళన కలిగించడంతో పాటు వాళ్లను తప్పుదోవ పట్టిస్తున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు.

Also Read: తక్కువ ధరకు బైక్ కొనేవాళ్లకు షాకింగ్ న్యూస్?

కేంద్ర ప్రభుత్వం కరోనా, లాక్ డౌన్ నిబంధనల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రజలపై భారం మోపే నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఆదాయపు పన్నుకు సంబంధించి ఆర్థిక మంత్రి స్పష్టతనివ్వడంతో గల్ఫ్ కార్మికులకు పన్ను విషయంలో నెలకొన్న టెన్షన్ తగ్గింది.

Back to top button