క్రీడలుప్రత్యేకం

Ind vs NZ:టెస్ట్ చాంపియన్ షిప్ నిబంధనలివీ

Ind vs NZ: Test Championship Rules

ఇంగ్లండ్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్యన ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ జరుగనుంది. ఈ మేరకు రంగం సిద్ధమైంది. ప్రపంచంలోని అన్ని జట్లను ఓడించి ఇండియా, న్యూజిలాండ్ ఫైనల్ కు చేరుకున్నాయి. ఇండియా తన పర్యటనల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ను మట్టికరిపించి ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరుకోగా.. న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురుచూస్తున్న ఈ ఫైనల్ కోసం ఐసీసీ తాజాగా నిబంధనలు ప్రకటించింది. ఐదురోజులు ఈ ఫైనల్ టెస్ట్ కు కేటాయించింది. ఒక ఫైనల్ తేలకుండా మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.నిర్ణీత కాల వ్యవదిలో వర్షం వచ్చినా.. ఏదైనా అడ్డంకి ఏర్పడినా ఆరోరోజు ఆటను నిర్వహిస్తారు. షార్ట్ రన్ విషయాలను మూడో ఎంపైర్ కే ఐసీసీ కట్టబెడుతూ నిబంధనలు మార్చేసింది.

ఇంగ్లండ్ లోని సౌంతాప్టన్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. జూన్ 18 నుంచి జూన్ 22 వరకు రెండు జట్లు ఫైనల్స్ లో ఢీకొంటాయి.

ఈ ఐదురోజుల మ్యాచ్ డ్రా అయితే పరుగులు, లీడింగ్ చూడరు. రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. మ్యాచ్ కు అంతరాయం కలిగితే రిజర్వ్ డే లో నిర్వహిస్తారు.ఐదురోజుల్లో తేలకపోతే డ్రానే. రిజర్వ్ డే పై రిఫరీదే తుది నిర్ణయం. మ్యాచ్ లో అంపైర్లు చెబితే షార్ట్ రన్ పై థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకుంటారు. మిగతా అన్ని నిబంధనలు అలాగే ఉంటాయి.

Back to top button