జాతీయంరాజకీయాలు

కరోనా కల్లోలం.. ఒక్కరోజే 1.61 లక్షల పాజిటివ్‌ కేసులు

COVIDకరోనా సెకండ్‌ వేవ్‌ దేశంలో జెట్‌ స్పీడ్‌లా దూసుకెళ్తోంది. గతేడాది ఛేదు జ్ఞాపకాలను ప్రజలు మరిచిపోకముందే మరోసారి మహమ్మారి భయపెడుతోంది. లక్షలాది పాజిటివ్‌ కేసులు రోజు వెలుగుచూస్తున్నాయి. అదేస్థాయిలో మళ్లీ మరణాలూ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం నడుస్తున్నా.. కరోనా కట్టడికి మాత్రం అడ్డకట్ట పడడం లేదు. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం అంటూ తేడా లేకుండా ప్రతీ రాష్ట్రంలోనూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.

గడిచిన 24 గంటల్లో దేశంలో 1,61,736 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. నిన్న 14 లక్షల టెస్టులు నిర్వహించగా.. ఈ కేసులు వెలుగుచూసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో ఇప్పుడు దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,36,89,453కి చేరింది. కొత్తగా 97,168 మంది ఈ వైరస్‌ బారిన పడ్డారు. మరోవైపు రికవరీ రేటు కూడా పడిపోయింది. ఒకప్పుడు 95 నుంచి 98 శాతం వరకు ఉన్న రికవరీ రేటు ఇప్పుడు 89.86కి పరిమితమైంది.

24 గంటల్లో మొత్తంగా 879 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు. ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 1,71,058కి చేరింది. దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 12,64,698కి పెరిగింది.

మరోవైపు.. దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా చాలా స్పీడ్‌గా నడుస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 40.04 లక్షల మందికి టీకా వేశారు. దీంతో ఇప్పటివరకు దేశంలో కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్న వారి సంఖ్య 10,85,33,085కి చేరింది. కరోనా సెకండ్‌ వేవ్‌ ఫస్ట్‌ వేవ్‌ కన్నా చాలా డేంజరస్‌గా ఉందని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Back to top button