క్రీడలు

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా.. ఇద్దరు కీలక బౌలర్లుకు రెస్ట్ ఇచ్చిన బీసీసీఐ.. ఎందుకు?

Bumrah and Shami

కరోనా క్రైసిస్ అనంతరం భారత్ తొలిసారిగా ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. కరోనా టైంలో క్రికెట్ ప్రియులను బీసీసీఐ నిర్వహించిన ఐపీఎల్ ఎంతగానో అలరించింది. 2020 ఐపీఎల్ ను రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ గెలుచుకున్న సంగతి తెల్సిందే. అయితే కరోనా క్రైసిస్ లో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేలు.. మూడు ట్వీ-20లు.. నాలుగు టెస్టులు నిర్వహించేందుకు ఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Also Read: కోహ్లిపై దీపావళి బాంబ్‌ వేసిన ఫ్యాన్స్‌

భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకొని ప్రాక్టీస్ చేస్తోంది. ఈనెల 27నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య సిరీస్ ప్రారంభం కానుంది. షెడ్యూల్ ప్రకారంగా చూస్తే ముందుగా వన్డే.. ట్వీ-20.. ఆ తర్వాత టెస్టులు మ్యాచులు జరుగనున్నాయి. కేవలం 12రోజుల వ్యవధిలో మూడు వన్డేలు.. మూడు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి.

భారత్ టీంలోని ఫాస్ట్ బౌలర్లను రోటేషన్ పద్ధతిలో ఆడించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా పరిమిత ఓవర్ల మ్యాచుల్లో జస్ప్రీత్ బుమ్రా.. మొహమ్మద్ షమీలని ఆడిస్తే టెస్టు నాలుగు టెస్టుల సిరీస్ వరకు వారు అలసిపోయే ప్రమాదం ఉందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. దీనికితోడు ఒకవేళ ఎవరైనా గాయపడితే కీలక టెస్ట్ సిరీస్‌కి వారు దూరం ప్రమాదం ఏర్పడనుంది.

Also Read: ఆ పుకార్లపై వార్నర్‌‌ క్లారిటీ.. సన్ రైజర్స్ కు గుడ్ న్యూస్

టెస్టు జట్టులోకి బుమ్రా.. షమీలతోపాటు ఫాస్ట్ బౌలర్లు ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ లను బీసీసీఐ ఎంపిక చేసింది. గాయపడిన ఇషాంత్ శర్మ కూడా ఫిట్‌నెస్ సాధించడంతో బౌలర్లు చాలామంది అందుబాటులో ఉన్నారు. అయితే వన్డే, టీ20 సిరీసులకు జస్ప్రీత్ బుమ్రా.. మొహమ్మద్ షమీలను దూరంగా ఉంచాలని టీమిండియా భావిస్తోంది.

గత రెండు నెలలుగా వీరిద్దరు తీరికలేకుండా క్రికెట్ ఆడిన నేపథ్యంలో బుమ్రా.. షమీలకు విశ్రాంతిని ఇవ్వాలని భావిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో నవదీప్ సైనీ‌తోపాటు మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్‌లను ఆడించాలని చూస్తోంది. చాలామంది బౌలర్లు అందుబాటులో ఉండటంతోనే బీసీసీఐ రోటేషన్ పద్ధతిలో వీరికి అవకాశం కల్పించేందుకు ప్లాన్ చేస్తోంది. భారత్-టీమిండియా మధ్య తొలి టెస్టు డిసెంబర్ 17న ఆడిలైడ్లో జరుగనుంది.

Back to top button