అత్యంత ప్రజాదరణక్రీడలుజాతీయంరాజకీయాలు

ఇంగ్లండ్ తో టెస్ట్: కష్టాల్లో భారత్.. వరుసగా 4 వికెట్లు ఫట్

india vs england 4th-test day 2-live score motera cricket stadium ahmedabad

ఇంగ్లండ్ తో జరుగుతున్న ఆఖరి 4వ టెస్టులోనూ ఆధిపత్యం దోబూచులాడుతోంది. ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 205 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందం భారత్ కు లేకుండా పోయింది. రెండో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. నిన్న ఖాతా తెరవకుండానే ఓపెన్ శుభ్ మన్ గిల్ ఔట్ కాగా.. తాజాగా రెండోరోజు ఆట ప్రారంభం కాగానే వరుసగా భారత్ వికెట్లు కోల్పోయింది.

రెండోరోజు వరుసగా పూజారా, విరాట్ కోహ్లీ వికెట్లు కోల్పోయింది. పూజారా 17 పరుగులు చేసి ఔట్ కాగా.. కోహ్లీ పరుగుల ఖాతా తెరవకుండా డకౌట్(0)కు ఔట్ కావడం అభిమానులకు షాకిచ్చింది. ఈ మధ్యకాలంలో వరుసగా కోహ్లీ విఫలమవుతూ మరోసారి సున్నాకే ఔట్ అయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన రహానే (27) కూడా తక్కువకే ఔట్ అయ్యాడు. అయితే మరో ఎండ్ లో రోహిత్ శర్మ నిలకడగా ఆడుతున్నాడు. అర్థసెంచరీకి చేరువ అయ్యాడు. ఇక రోహిత్ కు తోడుగా పంత్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరూ ఆచితూచి ఆడుతున్నారు.

ఈరోజు నిలబడి కనీసం 300 పరుగులు చేస్తే 4వ టెస్టుపై పట్టు చిక్కుతుంది. లేదంటే ఇంగ్లండ్ కు అవకాశం ఇచ్చినట్టు అవుతుంది.

Back to top button