క్రీడలు

India vs England 5th Test: ఇండియా, ఇంగ్లండ్ ల మధ్య ఐదో టెస్టు.. ఏం జరుగనుంది?

భారత క్రికెట్ జట్టు జోరుమీదుంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది. భారత బృందం పటిష్టమైన ఆటగాళ్లతో దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో

India vs England 5th Test: Fifth Test between India and England

India vs England 5th Test: భారత క్రికెట్ జట్టు జోరుమీదుంది. విజయాల పరంపర కొనసాగిస్తోంది. భారత బృందం పటిష్టమైన ఆటగాళ్లతో దూకుడు పెంచుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలో ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడేందుకు వెళ్లిన ఇండియా ఇప్పటికే 2-1 ఆధిక్యంలో దూసుకుపోతోంది. కానీ ఆటగాళ్లకు కరోనా సోకడంతో ఆటను మధ్యలోనే ఆపేయాల్సి వస్తోంది. ఇరు జట్ల అంగీకారంతో మ్యాచ్ ఆపేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. కోహ్లి సేన ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల ఇంగ్లండ్ లో టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడం. కానీ అది నెరవేరే దారి దగ్గరలో ఉన్నా కరోనా ప్రభావంతో అది కాస్త దూరమైపోతోంది.

మొదట్లో ఐదో టెస్ట్ నిర్వహించాలని భావించినా ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇరు జట్ల ఏకాభిప్రాయంతోనే మ్యాచ్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఐదో టెస్టును త్వరలోనే నిర్వహించేందుకు ఈసీబీ (ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు) తో పని చేస్తామని ఇండియా జట్టు ప్రకటించింది. క్రికెట్ మ్యాచ్ రద్దవడంపై క్రికెట్ అభిమానులు నిరాశకు లోనయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఈ విషయం వైరల్ అవుతోంది.

టీమిండియా జోరుకు మ్యాచ్ రద్దు కావడం కళ్లెం వేసినట్లు అయింది. ఇప్పటికే జోరు మీదున్న టీమిండియాకు చివరి మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని చూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. చివరి ఆటలో సత్తా చూపి చరిత్ర కెక్కాలని అనుకున్నా అది నెరవేరే సూచనలు కనిపించడం లేదు. దీంతో ఇంగ్లండ్ గడ్డపై సిరీస్ నెగ్గాలనే కల కలగానే మిగులుతోందని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో భారత్ అభిమానుల కోరిక నెరవేరడం లేదు. ఐదో మ్యాచ్ జరిగితే కచ్చితంగా ఫలితం మనకే అనుకూలంగా వస్తుందని ఆటగాళ్లలో బలమైన కాంక్ష ఉన్నా కలిసి రావడం లేదు. దీంతోనే ఇంగ్లండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ నెగ్గాలనే ఆశ మరికొంత కాలం పట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మళ్లీ తరువాత జరిగే ఆటలపైనే దృష్టి సారించాల్సి వస్తోంది.

Back to top button