క్రీడలు

India Vs England: ఇండియా -ఇంగ్లండ్ మ్యాచ్ రద్దు.. సిరీస్ ఎవరిది? ఎలా?

ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆఖరిదైన ఐదో టెస్టును రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.

India Vs England: ఇంగ్లండ్ తో 5 టెస్టుల సిరీస్ లో ఒక మ్యాచ్ రద్దు అయ్యింది. ఆఖరి మ్యాచ్ ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఆ తర్వాత భారత జట్టు ఐపీఎల్ కోసం యూఏఈ వెళ్లనుంది. ఈ క్రమంలోనే 5వ టెస్టుకు ముందు భారత్ కోచ్ లకు కరోనా సోకడం.. వారితోపాటు ఆటగాళ్లు సన్నిహితంగా ఉండడంతో కరోనా వల్ల ఐదో టెస్ట్ నిర్వహించడం సాధ్యం కాని పని అయ్యింది. ఆటగాళ్లు క్వారంటైన్ లోకి వెళుతుండడంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ఆఖరిదైన ఐదో టెస్టును రద్దు చేస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది.

ముందుగా కరోనా వల్ల భారత్ తుదిజట్టును దింపలేకపోతోందని.. దాంతో ఈ మ్యాచ్ ను భారత్ కోల్పోయినట్టు ప్రకటించింది. దీంతో కలకలం చెలరేగింది. ఎందుకంటే ప్రస్తుతం 5 టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1తో లీడ్ లో ఉంది. ఐదో టెస్టులో గెలిచినా డ్రా చేసుకున్నా సిరీస్ మన సొంతం. కానీ ఓడిపోయినట్టు ఈసీబీ ప్రకటించడంపై దుమారం చెలరేగింది.

కాసేపటికి ఏమైందో తెలియదు కానీ.. ఈసీబీ ప్రకటనలో మార్పులు చేసింది. చివరకు ఈ మ్యాచ్ రద్దు అయినట్లుగా మాత్రమే పేర్కొంది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ప్రస్తుతం ఈ మ్యాచ్ జగరకపోయినా తర్వాత నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. ఈ మ్యాచ్ పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.

ఇప్పటివరకు టీమిండియా 2-1 తేడాతో ముందుంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే సిరీస్ ఫలితంపై సందిగ్ధత నెలకొంది.

Back to top button