జనరల్విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 257 ఉద్యోగాలు..?

Indian Air Force Recruitment 2021

ఇండియన్‌ ఎయిర్‌‌ఫోర్స్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 257 గ్రూప్‌-సీ సివిలియన్‌ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి, ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నెలకు రూ.18,000 నుంచి రూ.25,500 వరకు వేతనం లభించనుంది.

Also Read: సీఐఎస్‌ఎఫ్ శుభవార్త.. భారీ వేతనంతో 2,000 ఉద్యోగాలు..?

https://indianairforce.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఉద్యోగాలకు ఎంప్లాయ్ మెంట్ న్యూస్ లో నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి నెల రోజుల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు స్క్రీనింగ్‌ టెస్ట్‌, రాతపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్ లో డిగ్రీ ఉన్నవాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: నిరుద్యోగులకు కాగ్నిజెంట్ శుభవార్త.. భారీగా ఉద్యోగావకాశాలు..?

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వెలువడిన నోటిఫికేషన్ లో మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌, హౌజ్‌కీపింగ్‌ స్టాఫ్‌, మెస్‌ స్టాఫ్‌, ఎల్‌డీసీ, క్లర్క్‌ హిందీ టైపిస్ట్‌, ఇతర ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి పదో తరగతి, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్మీడియట్‌ పాసైన వాళ్లు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లెవెల్ 1 ఉద్యోగాలకు 18,000 లెవెల్ 2 ఉద్యోగాలకు 19,900 స్టెనో గ్రేడ్ 2 ఉద్యోగాలకు 25,500 రూపాయల వేతనం లభిస్తుంది.

మరిన్ని వార్తలు కోసం: విద్య / ఉద్యోగాలు

తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగాలకు పోటీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. నోటిఫికేషన్ లో ఈ ఉద్యోగ ఖాళీల వివరాలు, వేతన వివరాలు, ఇతర వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

Back to top button