Indian Army TGC Recruitment 2021: దేశంలోని యువకులలో ఎంతోమంది ఇండియన్ ఆర్మీలో పని చేయాలని భావిస్తున్నారు. అయితే ఇండియన్ ఆర్మీలో పని చేయాలని భావించే వాళ్లకు ఇండియన్ ఆర్మీ శుభవార్త చెప్పింది. 134వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. బీటెక్ పాసైన పెళ్లి కాని పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. https://joinindianarmy.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. సెప్టెంబర్ 15వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. బీటెక్ ఫైనలియర్ విద్యార్థులు కూడా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
20 నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్, షార్ట్ లిస్టింగ్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 40 ఉద్యోగ ఖాళీలలో సివిల్/ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగ ఖాళీలు 10 ఉన్నాయి.
ఇతర విభాగాలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలు 30 ఉన్నాయి. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారికి భారీగా వేతనం లభిస్తుంది. నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది.