విద్య / ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త.. ఇంటర్ తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..?

Indian Navy Recruitment 2021

ఇండియన్ నేవీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్) మరియు సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమైంది. పెళ్లి కాని పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్ ఎంపీసీ పాసైన వాళ్లకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వాళ్లు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.

ఇండియన్ నేవీ ప్రధానంగా ఆఫీసర్స్, సెయిలర్స్, సివిలియన్స్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమవుతోంది. యూపీఎస్సీ డిఫెన్స్ సర్వీస్, నేవల్ అకాడమీ ద్వారా ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తుండగా సెయిలర్స్, సివిలియన్స్ ఉద్యోగాల కోసం ఇండియన్ నేవీ విడిగా నోటిఫికేషన్లను ఇస్తుండటం గమనార్హం. 2021 ఆగస్టు బ్యాచ్ సెయిలర్ పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ రిలీజ్ కాగా https://www.joinindiannavy.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం 2500 ఉద్యోగ ఖాళీలు ఉండగా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు 500, సీనియర్ సెకండరీ రిక్రూట్స్ ఉద్యోగ ఖాళీలు 2,000 ఉన్నాయి. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ) ఉద్యోగాలకు ఇంటర్ లో 60 శాతం మార్కులు వచ్చిన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 2001 సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 2004 సంవత్సరం జులై 31 మధ్య జన్మించిన వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) ఉద్యోగాలకు సైతం ఇవే అర్హతలు ఉన్నాయి. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఏప్రిల్ 30 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Back to top button