వ్యాపారము

ఈ పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొట్టిస్తే రూ.2 కోట్లు.. ఎలా అంటే..?

Indian Oil Diesel Bharo Inaam Jeeto Offer

ఇండియన్ ఆయిల్ కోటీశ్వరులు కావాలనుకునే వాళ్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులలో డీజిల్ కొట్టించుకునే వాళ్ల కోసం అద్భుతమైన ఆఫర్ ను తీసుకొచ్చింది. 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మన దేశానికి చెందిన పౌరులు ఈ ఆఫర్ ను పొందడానికి అర్హులు. సోషల్ మీడియా వేదికలలో ఒకటైన ట్విట్టర్ ద్వారా ఇండియన్ ఆయిల్ ఈ విషయాన్ని వెల్లడించింది.

దేశీ అతిపెద్ద ఆయిల్ కంపెనీగా పేరు తెచ్చుకున్న ఇండియన్ ఆయిల్ అందిస్తున్న ఈ ఆఫర్ ను పొందాలంటే కనీసం 25 లీటర్ల డీజిల్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే మాత్రమే ఈ ఆఫర్ కు వాహనదారులు అర్హత సాధిస్తారు. ఎంపికైన వారికి ఏకంగా 2 కోట్లరూపాయల వరకు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఒకే బిల్లుపై 25 లీటర్ల డీజిల్ కొట్టిస్తే మాత్రమే ఈ ఆఫర్ కు అర్హత సాధించే అవకాశం ఉంటుంది.

ఈ ఆఫర్ కు అర్హులైన వారికి నగదుతో పాటు ఇతర బహుమతులు కూడా లభించే అవకాశం ఉంది. దేశంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులలో ఏ బంకులోనైనా పెట్రోల్ ను కొట్టించుకోవచ్చు. 25 లీటర్ల డీజిల్ ను కొనుగోలు చేసిన తర్వాత బిల్లు నెంబర్‌ను, డీలర్ కోడ్‌ను ఎన్ని లీటర్లు పెట్రోల్ కొట్టించారనే వివరాలను 77990 33333 అనే నంబర్ కు మెసేజ్ చెయాల్సి ఉంటుంది.

మొదట డీలర్ కోడ్ ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి బిల్లు నంబర్ ను ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి ఎన్ని లీటర్లు పెట్రోల్ కొనుగోలు చేయాలనుకుంటున్నామో ఆ వివరాలను ఎంటర్ చేయాలి. సమీపంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ను సంప్రదించి ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Back to top button