తెలంగాణ బ్రేకింగ్ న్యూస్బ్రేకింగ్ న్యూస్

ఇంద్రవెల్లి పేరు చెబితే స్ఫూర్తి రగులుతుంది.. రేవంత్ రెడ్డి

Indravelli's name inspires me .. Rewanth Reddy

Revanth Reddy

ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫర్తి రగులుతుందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత, గిరిజన దండోరా బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కుమురంభీమ్ గడ్డ ఆదిలాబాద్ అని అన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుమురం భీం పోరాడారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ కు అన్యాయం జరిగిందని, అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ దేనని రేవంత్ హామీ ఇచ్చారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్ కు ఎస్సీలు గుర్తుకు వస్తారని, దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రూ. లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు.

Back to top button