సినిమా వార్తలు

ఓటీటీల ఎంక్వయిరీలు .. ఆ సినిమాల పరిస్థితి ఏంటీ ?

OTT Scam
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్ళీ సినిమాలు ఓటీటీ వైపు చూడాల్సి వస్తోంది. థియేటర్ రిలీజ్ కోసమే ఎంతో ప్లాన్ చేసుకున్న మేకర్స్, ఇష్టం లేకపోయినా డిజిటల్ రిలీజ్ కి అంగీకరించాల్సి వస్తోంది. అయితే ఈ సీజన్ లో తెలుగులో సరైన సినిమా ఒక్కటి కూడా ఇంకా ఓటీటీలోకి వెళ్ళడానికి డేట్ ఫిక్స్ చేసుకోలేదు. ప్రస్తుతం ఓటీటీ సంస్థలు సినిమాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాయి.

అయితే, గతంలో లాగా ఈ సారి ఏ సినిమా పడితే ఆ సినిమా తీసుకోకూడదు అని ఓటిటీ ప్లాట్ ఫామ్స్ ప్లాన్ చేసుకున్నాయి. ఎందుకంటే గత లాక్ డౌన్ టైంలో సినిమాల కోసం ఎగబడిన ఓటిటీ సంస్థలు పోటీ పడి మరీ, నిశ్శబ్దం, మిస్ ఇండియా లాంటి సినిమాల విషయంలో భారీ మొత్తాన్ని ఇచ్చి మరీ కొనుకున్నాయి. కానీ తీరా ఆ సినిమాలు రిలీజ్ అయ్యాక, ఓటిటీలకు ఒరిగింది ఏమి లేదు, పైగా బ్యాడ్ నేమ్ వచ్చింది.

అందుకే ఈ సారి ఓటీటీలు ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు ఓటీటీ దారిలోనే ఉన్నా.. ఓటీటీలు మాత్రం తొందర పడటం లేదు. సినిమాలు చూసిన తరువాతే కొంటున్నారు. కొన్ని సినిమాలు జస్ట్ ఓకే అనుకున్న వాటిని పక్కన పెట్టేస్తున్నారు. ఎలాగూ వచ్చే అక్టోబర్ వరకూ సినిమాలు ఉండకపోవచ్చు. మరోపక్క ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదే వుండకపోవచ్చు అని అనిపిస్తోంది.

ఎలాగూ డిజిటల్, శాటిలైట్ కోసమైనా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ల వైపు రావాల్సిందే. కాబట్టి తొందరపడకుండా ఏ సినిమా బాగా వచ్చింది ?, ఏ సినిమాకి విపరీతమైన బజ్ ఉంది ? అంటూ ఎంక్వయిరీలు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. నిర్మాతలు మాత్రం తమ సినిమాల విషయంలో ఇప్పటికీ ఎటూ డిసైడ్ చేసుకోలేక అయోమయంలో ఉన్నారు.

Back to top button