సినిమా

Intinti Gruhalakshmi: తులసిని జైలుపాలు చేసిన లాస్య.. ప్రేమ్ పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసిన నందు?

బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ

Intinti Gruhalakshmi: Tulasi In Police Station, Nandu Fix Pream Marriage Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగ్ తో కూడా బాగానే దూసుకుపోతుంది. ఇక నందు, లాస్య చేసిన ప్లాన్ కు శృతి.. ప్రేమ్ ప్రేమను నిరాకరిస్తుంది. తులసితో శృతి చెప్పిన మాటలు ప్రేమ్ విని బాధపడతాడు. ఈ విషయాన్ని లాస్య.. నందుతో చెప్పడంతో.. ఇక ప్రాబ్లం సాల్వ్ కదా అక్షరతో పెళ్లికి ఒప్పుకుంటే మన బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుందని అనుకుంటారు. జీకే కి ఫోన్ చేసి పెళ్లి గురించి మాట్లాడుతాడు. అక్షర ప్రేమ్ కి ఫోన్ చేసి ఆటపట్టించడంతో ప్రేమ్ ఆమెపై కోపంతో తిడతాడు. అక్షర వెళ్లి ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పుకొని బాధపడుతుంది.

అక్షర తన పేరు చెప్పకుండా ప్రేమ్ తో మాట్లాడిన విషయాన్ని చెప్పేసరికి అందులో తన తండ్రి ప్రేమ్ తప్పు లేదు అంటూ అనేసరికి అవును కదా అనుకొని కూల్ అవుతుంది. మరోవైపు నందు అందరి ముందు ప్రేమ్ పెళ్లి గురించి ప్రశ్నిస్తాడు. ప్రేమ్ నందు ప్రశ్నలను, ఇంట్లో వారి ప్రశ్నలను తట్టుకోలేక శృతి గురించి ఓపెన్ అవుతాడు. ఆమెనే పెళ్లి చేసుకుంటాను అంటూ అనడంతో శృతి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోను.. నువ్వంటే ఇష్టం లేదు అంటూ అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. ప్రేమ్ శృతి కాదనే సరికి ఎమోషనల్ అవుతాడు. పక్కనే నందు, లాస్య సంతోషంగా ఫీల్ అవుతారు.

ఇక శృతి తన తండ్రి ఫోటో ముందు కూర్చొని తన ప్రేమ గురించి బయటకు చెప్పుకోలేక పోతున్నాను అంటూ బాగా ఏడుస్తుంది. మరోవైపు తులసి శృతి మాటలను తలుచుకోగా.. అదే సమయంలో తన మామ గారు రావడంతో శృతి, ప్రేమ్ ప్రేమల గురించి మాట్లాడుతుంది. అక్కడికి తన అత్త గారు వచ్చి శ్రుతి పై కోప్పడుతూ తులసిని తిడుతుంది. శృతి కూర్చొని ఏడుస్తుండగా ప్రేమ్ అక్కడికి వచ్చి ఎమోషనల్ గా మాట్లాడుతుంటాడు. ఇక తరువాయి భాగంలో లాస్య.. ప్రేమ్, అక్షరల పెళ్లి విషయంలో పేరు సంపాదించుకోవడం కోసం.. తులసిని బౌన్స్ అయిన చెక్కు విషయంలో పోలీసులతో అరెస్టు చేయించే ప్లాన్ చేస్తుంది.

Back to top button