క్రీడలుజనరల్బ్రేకింగ్ న్యూస్

ఐపీఎల్: చెన్నై 188 టార్గెట్: ఢిల్లీ దంచికొట్టింది

IPL: Chennai 188 Target: Delhi cracked

వెటరన్ బ్యాట్స్ మెన్ సురేష్ రైనా ఆపదలో ఆదుకున్నాడు. జాతీయ జట్టుకు దూరమైన కూడా తన పాత ఫామ్ ను అందుకొని ఎడా పెడా బౌండరీలు బాదేశాడు. దీంతో ఒక్కరొక్కరుగా ఔట్ అయినా కూడా చెన్నైని పోటీలో నిలబెట్టాడు.

ముంబైలోని వాంఖడేలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ ఢేర్ డెవిల్స్ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ ఓడిన బ్యాటింగ్ కు దిగిన చెన్నైకి తొలి రెండు ఓవర్లలోనే గట్టి షాక్ తగిలింది. గైక్వాడ్ 5, డుప్లిసెస్ 0 పరుగులకే ఔట్ కావడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే క్రీజులోకి వచ్చిన మెయిన్ అలీ, సురేష్ రైనా లు చెన్నైని నిలబెట్టారు.

అయితే ప్రమాదకరంగా మారిన ఈ జంటలో మెయిన్ అలీ 36 పరుగులకు అశ్విన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రైనా రెచ్చిపోయాడు. 54 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో అంబటి రాయుడు 23 పరుగులతో దంచికొట్టాడు. అయితే ధోని మాత్రం డకౌట్ అయ్యి నిరాశపరిచాడు. చివర్లో సామ్ కరన్ 34, రవీంద్ర జడేజా 26 పరుగులతో మెరుపులు మెరిపించడంతో చెన్నై 188 పరుగులు భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.

అయితే అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ఓపెనర్లు చెలరేగిపోయారు. శిఖర్ ధావన్ , ఫృథ్వీ షాలు ఆఫ్ సెంచరీలతో చెలరేగిపోయారు. తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసి ఢిల్లీని నిలబెట్టారు. ఇద్దరూ వికెట్ పడకుండా చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. 13 ఓ వర్లలోనే ఢిల్లీ 136 పరుగులు చేసింది.
42 బంతుల్లో 53 పరుగులు చేయాల్సి ఉంది. ఓపెనర్లు ఇద్దరూ ఔట్ అయినా పంత్, స్టాయినిస్ చివరి వరకు ఉండి ఈజీగా ఢిల్లీని గెలిపించారు. వారు దంచి కొట్టడంతో ఢిల్లీ విజయం ఖాయమైంది.

Back to top button