క్రీడలు

ఐపీఎల్: ముంబై vs రాజస్థాన్.. గెలుపెవరిది?

IPL: Mumbai vs Rajasthan .. Who won?

ఈ ఐపీఎల్ ముంబై ఇండియన్స్ అనుకున్నంతగా రాణించడం లేదు. అదే సమయంలో అనిశ్చితికి మారుపేరైన రాజస్థాన్ రాయల్స్ సైతం తడబడుతోంది. ఈ రెండు టీంల మధ్య తాజాగా మరో మ్యాచ్ ఇప్పుడు ఢిల్లీ వేదికగా జరుగుతోంది. ముంబై ఐదు మ్యాచ్ ల్లో రెండు విజయాలతో 4వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ కూడా రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ఈ రెండు టీంలు ఈరోజు ఢిల్లీ వేదికగా తలపడబోతున్నాయి.

ముంబైకి భీకర ఆటగాళ్లున్నారు. టీమిండియాకు ఆడేవాళ్లలో సగం మంది ముంబైకి ఉన్నారు. రోహిత్, డికాక్, హార్థిక్ , కీరన్ పొలార్డ్, సూర్య కుమార్, ఇషాన్ లు సరిగా ఆడడం లేదు. చివరి రెండు మ్యాచ్ లలో ఆ జట్టు స్కోరు 150 పరుగులు దాటలేదు. దీంతో ఓడిపోయారు. మిడిల్ ఆర్డర్ సమస్య ముంబైని వేధిస్తోంది. బౌలింగ్ లో మాత్రం బలంగా ఉంది. బుమ్రా, బౌల్ట్ సత్తా చాటుతున్నారు. పాండ్యా బ్రదర్స్ రాణిస్తే రాజస్థాన్ కు కష్టాలు తప్పవు. మూడో విజయం సాధించాలని ముంబై ఈసారి పట్టుదలగా ఉంది.

ఇక రాజస్థాన్ కు కీలకమైన విదేశీ ఆటగాళ్లు అయిన బెన్ స్టోక్స్, ఆర్చర్ వైదొలగడంతోపాటు అండ్రూ టై, లివింగ్ స్టోన్ లు వ్యక్తిగత కారణాలతో రాజస్థాన్ ను వదిలేశారు. దీంతో రాజస్తాన్ కు విదేశీ ఆటగాళ్ల కొరత తీవ్రంగా ఉంది. కానీ చివరి మ్యాచ్ లో కోల్ కతాపై 6 వికెట్ల తో గెలిచి ఈ మ్యాచ్ కు అదే ఉత్సాహంతో సిద్ధమవుతోంది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ సంశాన్ జోరు మీద ఉన్నాడు. శ్రయాస్ గోపాల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ లో గెలుపు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది.

ఐపీఎల్ చరిత్ర : ఈ రెండు టీంలు ఒకరితో ఒకరు 23 మ్యాచ్‌ల్లో తలపడ్డారు. ముంబై, రాజస్థాన్ 11 మ్యాచ్ లను గెలిచాయి. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది.

మ్యాచ్ వేదిక: అరుణ్ జైట్లీ స్టేడియం, ఢిల్లీ.

మ్యాచ్ సమయం: మధ్యాహ్నం 03.30 PM

Back to top button