అత్యంత ప్రజాదరణక్రీడలుజాతీయంరాజకీయాలు

క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త.. ఐపీఎల్ వేదికలు ఖరారు.. ఎక్కడెక్కడంటే?

దేశంలో క్రికెట్ పండుగకు సర్వం సిద్ధమవుతోంది. ఇటీవలే ఐపీఎల్ మినీ వేలాన్ని నిర్వహించారు. పలువురు క్రికెటర్లపై కోట్లు కుమ్మరించి తీసుకున్నారు.ఐపీఎల్ వేలం ముగియడంతో ఇప్పుడు టోర్నీ ఎక్కడెక్కడ నిర్వహించాలనే దానిపై బీసీసీఐ, ఐపీఎల్ మేనేజ్ మెంట్ కసరత్తు పూర్తి చేసింది.

Also Read: ఐపీఎల్ కు డేవిడ్ వార్నర్ దూరం.. సన్ రైజర్స్ కు షాక్

గత ఏడాది ఐపీఎల్ ను కరోనా తీవ్రత దృష్ట్యా యూఏఈలో నిర్వహించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఐపీఎల్ 14ను దేశంలోనే నిర్వహిస్తామని బీసీసీఐ తెలిపింది.

ఇందులో భాగంగా తాజాగా ఐపీఎల్ వేదికలుగా ముంబై, అహ్మదాబాద్లను ఎంపిక చేయాలని బీసీసీఐ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం.

Also Read: ఐపీఎల్ టోర్నీ మొత్తం ఒకే వేదిక‌పై..? కార‌ణం ఇదేన‌ట‌!

గ్రూపు దశలో నిర్వహించే మ్యాచ్ లను ముంబైలోని నాలుగు స్టేడియాల్లో.. ప్లే ఆఫ్స్, ఫైనల్ ను అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఏప్రిల్ మధ్య వారంలో ఈ ఐపీఎల్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకోబోతున్నారు.

Back to top button