క్రీడలుజాతీయం - అంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్

ఎంఐ vs ఆర్సీబీ: టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ

IPL: Virat Kohli wins toss

ఐపీఎల్ తొలి మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. చెన్నైలో జరుగుతున్న తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. కరోనా నిబంధనలతో ఈసారి హంగు ఆర్భాటాలు లేకుండా సాదాసీదాగానే ఐపీఎల్ ను ప్రారంభించారు.

గత సారి చాంపియన్ గా నిలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ వేయగా.. బెంగళూరు కెప్టెన్ కోహ్లీ టాస్ గెలిచాడు. ఫ్లాట్ వికెట్ కావడం.. పరుగులు బాగా వస్తాయని.. సెకండ్ బ్యాటింగ్ చేయడం బెటర్ అని.. పిచ్ చూసి బౌలింగ్ ఎంచుకున్నట్టు కోహ్లీ తెలిపారు. ఈ వికెట్ పై మొదట బౌలింగ్ ఎంచుకుంటే బెటర్ అని.. తర్వాత తేమ వల్ల బౌలింగ్ చేయడం ఇబ్బంది అవుతుందని కోహ్లీ తెలిపాడు.

టాస్ ఓడి మొదట ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కు దిగాల్సి వచ్చింది. పిచ్ కండీషన్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేకున్నా.. బలమైన టీం ఉండడం తమకు భరోసాగా ఉందని రోహిత్ శర్మ తెలిపారు. పాజిటివ్ థికింగ్ తో బ్యాటింగ్ మొదలు పెడుతామని కోహ్లీ తెలిపాడు.

బౌలింగ్ ఎంచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మొదట బౌలింగ్ చేస్తూ ఛేదనకు రెడీ అయ్యింది. ముంబై బ్యాటింగ్ కు దిగింది.

Back to top button