క్రీడలు

ఐపీఎల్ విజేత పోటీ: ఢిల్లీ కప్ సాధిస్తుందా?

ఐపీఎల్‌లో వరుస విజయాలతో ఢిల్లీ దూకుడు మీదుంది. పది పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలోనూ సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. శ్రేయస్‌ అయ్యార్‌‌ టీమ్‌ ఫస్ట్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమి పాలు కాగా.. ఆ తర్వాత నిన్న ముంబయి చేతిలో ఓడిపోయింది. ఢిల్లీ జట్టు ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండంటే రెండే ఓడిపోయింది.

ఈ క్రమంలో నిన్నటి మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. శనివారం కోల్‌కతా చేతిలో ఓటమిపాలైన పంజాబ్‌ టీ20 లీడ్‌ చరిత్రలో వంద మ్యాచ్‌లు ఓడిపోయిన తొలి జట్టుగా రికార్డు సృష్టించింది. ఢిల్లీ కూడా ముంబయి చేతిలో ఓడిపోయి అదే అవసరం లేని చెత్త రికార్డును సొంతం చేసుకుంది. దీంతో శ్రేయాస్‌ టీం కూడా ఈ టోర్నీలో 100 మ్యాచ్‌లు ఓడిపోయిన రెండో జట్టుగా నిలిచింది.

ఏ ఐపీఎల్‌ సీజన్‌లోనూ ఢిల్లీ ఇప్పటివరకు ఫైనల్‌ చేరలేదు. 2009, 2012, 2019 సీజన్లలో ప్లేఆఫ్స్‌కు చేరినా మూడో స్థానంతోనే సరిపెట్టుకుంది. ఈ 13వ సీజన్‌లో విశేషంగా రాణిస్తూ ఆకట్టుకుంటోంది. హైదరాబాద్, ముంబయి జట్లతో ఓటమి తప్ప మిగితా అన్ని మ్యాచ్‌లనూ తన ఖాతాలో వేసుకుంది.

అయితే.. ఆ రెండు మ్యాచ్‌లు ఓడినా ప్రస్తుతం ముంబయి జట్టుతో సమానంగా 10 పాయింట్లతో ఉంది. రన్‌రేట్‌ పరంగానూ రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ తన ఆటను ఇలాగే ప్రదర్శిస్తే ఈసారి కప్‌ సాధించే అవకాశాలూ లేకపోలేదు. ఇప్పటివరకు ఫైనల్‌ వరకు కూడా చేరలేని ఈ జట్టు.. ఈ సారి కప్‌ సాధిస్తుందా చూడాలి మరి..

Back to top button