సినిమా

వినాయక్ ను చిరు సైడ్ చేస్తున్నాడా? నిజమెంత..!

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఫుల్ బీజీగా మారాడు. చిరంజీవి రీ ఎంట్రీ మూవీగా వచ్చిన ‘ఖైదీ-150’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఖైదీ-150’ బాక్సాఫీస్ వద్ద చిరు స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. తాజాగా వీరిద్దరి కాంబోనేషన్లో మరో మూవీ రానుందని ప్రచారం జరిగింది.

Also Read: కొత్త రచయితలకు పూరి పాఠాలు !

మెగాస్టార్ చిరంజీవి-వినాయక్ కాంబినేషన్లలో ఠాగూర్.. ఖైదీ-150 వంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు కూడా రీమేక్ మూవీలే కావడం విశేషం. తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మలయాళంలో సూపర్ హిట్టయిన ‘లూసీఫర్’ రానుందని ప్రచారం జరిగింది. తొలుత ఈ మూవీ దర్శకుడిగా సుజిత్ పేరు విన్పించింది. ఇటీవల అతడు పెళ్లి చేసుకోవడంతో ఈ మూవీ నుంచి తప్పుకున్నాడనే వార్తలు విన్పించాయి.

సుజిత్ స్థానంలో దర్శకుడు వినాయక్ పేరు విన్పించింది. మెగా ఫ్యాన్స్ లో దర్శకుడు వినాయక్ కు మంచి క్రేజ్ ఉంది. చిరు-వినాయక్ కాంబోలో హ్యట్రిక్ మూవీగా లూసీఫర్ రీమేక్ రానుండటంతో అభిమానులు ఖుషీ అయ్యాయి. అయితే ఈ మూవీలో స్క్రీప్టులో వినాయక్ చేసిన కామెడీ షేపప్ మెగాస్టార్ కి నచ్చలేదనే టాక్ విన్పిస్తోంది. దీంతో అతడి స్థానంలో మరో దర్శకుడి పేరు తెరపైకి వచ్చింది.

Also Read: యాంకర్ ప్రదీప్ నిజస్వరూపం బయటపెట్టిన సింగర్ సునిత..!

వినాయక్ స్థానంలో ‘ధృవ’ ఫేం మోహన్ రాజా పేరు విన్పిస్తోంది. వినాయక్ స్థానాన్ని మోహన్ రాజాతో చిరంజీవి భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోవడంతో అభిమానులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రస్తుతం చిరంజీవి కోరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ‘వేదాళం’ రీమేక్ చేయనున్నాడు. ఆ తర్వాతే లూసీఫర్ పట్టాలెక్కనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Back to top button