పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్ తన పార్టీ తరుఫున ప్రచారం చేయకున్న ప్రజలు వైసీపీనే గెలిపించారు. నెత్తిన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జగన్ కదులుతున్నారు. తిరుపతిలో బలమైన టీడీపీ, బీజేపీ-జనసేనలను ఢీకొట్టేందుకు స్వయంగా వస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారానికి జగన్ రాబోతున్నారన్న వార్త ఆసక్తి రేపుతోంది. జగన్ రాకుంటే వైసీపీకి ఓట్లు పడవని.. జూనియర్ అయిన గుర్తుమూర్తిని ప్రజలు లైట్ తీసుకుంటున్నారన్న ప్రచారం నేపథ్యంలోనే జగన్ వస్తున్నారని చెబుతున్నారు.
వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని గెలిపించాలని కోరుతూ ఈనెల 14న సీఎం జగన్ తిరుపతిలో వైసీపీ నిర్వహించే ర్యాలీ, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. దీంతో టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి జగన్ ఎందుకొస్తున్నారనే దానిపై అసలు విషయాన్ని బయటపెట్టాయి. ఓడిపోతామన్న భయంతోనే జగన్ తిరుపతి ప్రచారానికి వస్తున్నారని టీడీపీ, బీజేపీ హోరెత్తిస్తున్నాయి. నిఘావర్గాలు హెచ్చరించాయని.. ఓడిపోతామనే భయంతోనే జగన్ వస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నాయి.
జగన్ వైసీపీ పార్టీ అధినేత. ఆయన పార్టీ అభ్యర్థులను గెలిపించే బాధ్యత ఆయనపై ఉంటుంది. మున్సిపల్, పంచాయతీలు గ్రామస్థాయివి కాబట్టి అక్కడ ప్రచారానికి స్కోప్ ఉండదు. అదే తిరుపతి ఎంపీ సీటు ప్రతిష్టాత్మకం. ఇక్కడ ఓడిపోతే అధికార పార్టీకి అవమానం. దాంతోపాటు తనకు సేవ చేసిన గుర్తుమూర్తిని గెలిపించాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. అందుకే తరలివస్తున్నారని వైసీపీ చెబుతోంది.
జగన్ వస్తున్నారని తెలిసి ఎందుకొస్తున్నారని చంద్రబాబు , టీడీపీ సెటైర్లు వేస్తున్నాయి. మున్సిపల్, పంచాయతీల్లో వదిలేయాలని.. ఓడిపోతామన్న భయమే జగన్ ను రప్పిస్తోందని చంద్రబాబు విమర్శించారు.. చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ ఇక్కడ ప్రచారం చేయడం.. బీజేపీ బలంగా దూసుకెళుతుండడంతో జగన్ , వైసీపీలో ఆందోళన నెలకొంది. రాకుంటే ఫ్లేటు మారే ఉద్దేశంతోనే జగన్ వస్తున్నట్లు తెలుస్తోంది..