తెలంగాణప్రత్యేకంరాజకీయాలు

కేసీఆర్ ను ఓడించాలన్న కల బీజేపీతో సాధ్యమా?

Is it possible with the BJP to defeat KCR?

తెలంగాణ బీజేపీ నేలవిడిచి సాముచేస్తోందా? అసలు క్షేత్రస్థాయిలో బలపడకుండా.. క్యాడర్ ను, నాయకులను పెంచుకోకుండా బలమైన సీఎం కేసీఆర్ ను మాటలతో రెచ్చగొడుతూ ఎదుర్కోవడం అన్ని సార్లు సాధ్యం కాదని తాజాగా నిరూపితమైంది.

దుబ్బాక, జీహెచ్ఎంసీలో దూకుడు అయిన రాజకీయం చేసిన తెలంగాణ బీజేపీకి అక్కడ పనిచేసిన మ్యాజిక్ రాష్ట్రమంతటా పనిచేయదని తేటతెల్లమైంది. ఎంతలా అంటే ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత బీజేపీ సీటును కూడా కోల్పోవడం తీరని అవమానాన్ని మిగిల్చింది.

ఇక నాగార్జున సాగర్ లోనూ బీజేపీ వేసిన తప్పటడుగులు ఆ పార్టీ కొంప ముంచాయి. అసలేమాత్రం ప్రజా బలం లేని ఒక డాక్టర్ పెట్టి బీజేపీ ఉద్దండులైన జానారెడ్డి, నోముల భగత్ లతో పోటీపడడం బీజేపీ క్యాడర్ నే ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకే సాగర్ లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఓడిపోయింది. నిజానికి అక్కడ బీజేపీకి బలమైన నాయకుడు లేడు. అదే తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తిని బీజేపీ పోటీచేపించి ఉంటే కథ వేరుండేది.

ఇక తాజాగా జరిగిన ఐదు మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్ల ఎన్నికల్లోనూ పేలవమైన ప్రదర్శన చేసిన బీజేపీ ఇప్పటికైనా తనను తాను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఖమ్మలో అతిరథ మహారథులు ఏపీ నుంచి వచ్చిన బీజేపీ నేతలు కూడా వచ్చి ప్రచారం చసినా 60 స్తానాలకు గాను కేవలం ఒకే ఒక స్థానానికి బీజేపీ పరిమితం కావడం ఆ పార్టీకి తీరని అవమానంగా మారింది.

ఇక ఈ మినీ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 122 వార్డుల్లో పోటీచేసిన బీజేపీ కేవలం 4 వార్డులు మాత్రమే గెలిచిందంటే క్షేత్రస్థాయిలో ఆ పార్టీ బలం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికైనా వార్డు స్తాయి నుంచి బలమైన నేతలు, నాయకులను తయారు చేస్తే తప్ప 2023లో కేసీఆర్ ను ఓడించాలన్న కలను బీజేపీ నెరవేర్చుకునే అవకాశాలు కనిపించడం లేదు.

Back to top button