కరోనా వైరస్టాలీవుడ్తెలంగాణబ్రేకింగ్ న్యూస్రాజకీయాలుసినిమాసినిమా వార్తలు

మెగా బ్రదర్ నాగబాబుకు కరోనా సోకిందా?

టీవీ షూటింగ్ ల సమయంలోనే కరోనా వైరస్ సోకిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. ఏపీలో అయితే విచ్చలవిడిగా అందరికీ సోకుతోంది. తెలంగాణలోని హైదరాబాద్ లోనూ పంజా విసురుతోంది. ఇప్పటికే సినీ, రాజకీయ ప్రముఖులు ఎందరో కరోనా బారినపడ్డారు. తాజాగా మెగాస్టార్ సోదరుడు, నటుడు, నిర్మాత నాగబాబు కరోనా బారినపడినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రెండు రోజులుగా దగ్గు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Also Read : హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

ఈ క్రమంలోనే నాగబాబుకు తాజాగా కరోనా లక్షణాలు బయటపడినట్టు తెలుస్తోంది. ఆయన కరోనా వైరస్ పరీక్ష చేయించుకున్నారని.. అందులో పాజిటివ్ గా తేలిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కరోనా లాక్ డౌన్ సడలింపులలో భాగంగా టీవీ షూట్స్ కి పర్మిషన్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘అదిరింది’ సహా పలు టీవీ షోలలో నాగబాబు రెగ్యులర్ గా పాల్గొంటున్నారు. నాగబాబు టీవీ షోలకు హాజరవుతున్నారు. ఇటీవల తన కుమార్తె నిహారికతో కలిసి ఒక ఇంటర్వ్యూ కూడా చేశాడు. ఈ షూటింగ్ సమయంలోనే కరోనా వైరస్ సోకిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రస్తుతం నాగబాబు సైతం హోం క్వారంటైన్ లో ఉంటున్నట్టు తెలిసింది. నాగబాబుకు కరోనా అని తెలియగానే ఆ షోలో పాల్గొన్నవారితోపాటు ఆయన కుటుంబ సభ్యులు షాక్ అయ్యారట.. సినీ ప్రముఖులు కూడా కలవరపడ్డారు.

అయితే తనకు కరోనా అన్న విషయాన్ని నాగబాబుకు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. మీడియా సర్కిల్స్ లో వస్తున్న వార్తలను ఆయను ధ్రువీకరించలేదు.

Also Read : వారితో గడిపి ఎంతో అనుభూతి చెందాను – రేణూ దేశాయ్ 

Back to top button