టాలీవుడ్సినిమాసినిమా వార్తలు

హీరోయిన్ కు మేనేజర్ టోకరా.. చీటింగ్

సినిమాల్లోకి వచ్చి భారీగా సంపాదిస్తున్న హీరోయిన్లు వాళ్ల మేనేజర్లను గుడ్డిగా నమ్ముతుంటారు. వారు లక్షలు కనపడగానే చీటింగ్ చేసి పరార్ అవుతారు. మోసం జరిగిందని తెలిసి సినీ తారలు పోలీస్ స్టేషన్ గడపతొక్కుతారు.

తాజాగా టాలీవుడ్ లో ఓ క్యారెక్టర్ ఆర్టిస్టును మేనేజర్ మోసం చేశాడనే విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న నటీమణికి చాలా కాలం నుంచి మేనేజర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఇలా చీటింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు రావడం దుమారం రేపింది.

దక్షిణాదిలో హాట్ హీరోయిన్ గా చేసి తెలుగులో టాప్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన ఈమెను ఆమె మేనేజర్ డబ్బుల విషయంలో దారుణంగా మోసగించిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.ఇదిప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.

మేనేజర్ నిర్వాకంతో షాక్ అయిన నటి వెంటనే ఈ విషయమై నిలదీసిందని.. మేనేజర్ బుకాయించడంతో నిర్మాతలు, ప్రొడక్షన్ మేనేజర్లతో పంచాయితీ పెట్టించిందని తెలిసింది. నిర్మాతలు ఇచ్చిన అసలు రెమ్యూనరేషన్ కంటే చాలా తక్కువ రెమ్యూనరేషన్ ను నాకు మేనేజర్ ఇచ్చాడని.. కమీషన్ తీసుకున్నాడని తెలియడంతో నటి తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. నిర్మాతలు ఇచ్చిన జీఎస్టీ మొత్తాన్ని సదురు మేనేజర్ నొక్కేశాడని.. జీఎస్టీ కటించాడనే విషయం తన దృష్టికి రాలేదని వాపోయింది. దాదాపు 60-70 లక్షల వరకు ఈ మొత్తం మోసపోయానని అంటోంది. ఇప్పుడు ప్రస్తుత మేనేజర్-నటి మధ్య ఈ వివాదం మరింతగా ముదురుతోంది.

Back to top button