తెలంగాణరాజకీయాలు

కేసీఆర్ పై కోర్టులోనే ఈటల యుద్ధం

Itala Rajender war in court against KCR

ఒకసారి పదవిలోంచి తీసేసాక ఇక అన్నా లేడు తమ్ముడు లేడు. అందుకే ‘తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటేనని’ ఈటల రాజేందర్ డిసైడ్ అయ్యాడు. సీఎం కేసీఆర్ పై పోరుబాటకు దిగాడు. కోర్టులోనే తేల్చుకునేందుకు రెడీ అయ్యాడు.

భూకబ్జా ఆరోపణలతో మంత్రి పదవి కోల్పోయిన ఈటల రాజేందర్ ఇప్పుడు హైకోర్టులోనే కేసీఆర్ సర్కార్ తో పోరాడేందుకు డిసైడ్ అయ్యారు. మెదక్ జిల్లా అచ్చంపేటలో ఈటల రాజేందర్, ఆయన కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు ఆక్రమించారని పలువురు రైతులు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతోనే ఈటల మంత్రి పదవి కోల్పోయారు. 48 గంటల్లోనే కేసీఆర్ సర్కార్ ఈటలను డమ్మీని చేసేసింది.

అయితే తనకు తెలియకుండానే అధికారులు సర్వేలు చేయడం.. ఆక్రమణలని తేల్చడంపై ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో ఇలా చేస్తారా? అని న్యాయస్థానం తలుపుతట్టారు. తాను అక్కడ పోరాటం చేస్తానని ఈటల హెచ్చరించారు.

అన్నట్టుగా తన జమున హ్యాచరీస్ ద్వారా ఈటల ఫ్యామిలీ హైకోర్టును ఆశ్రయించింది. అసైన్డ్ భూముల వ్యవహారంలో కలెక్టర్ నివేదిక తప్పుల మయమని పిటీషన్ లో జమ్మున హ్యాచరీస్ పేర్కొంది. తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని హైకోర్టులో ఈటల వాదించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేస్తారా? అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటీషన్ లో కోరారు.

మరి ఈ వ్యవహారంలో హైకోర్టు ఎలా స్పందిస్తుంది? ఈటలకు ఫేవర్ గా తీర్పు వస్తుందా? కేసీఆర్ సర్కార్ ను ప్రశ్నిస్తుందా? అన్నది వేచిచూడాలి.

Back to top button