జాతీయంమిర్చి మసాలారాజకీయాలు

వైరల్:తాజ్ ముందు ఇవాంకా ఫొటోల మార్ఫింగ్?

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటన ముగిసింది. కుటుంబ సమేతంగా భారత్ కి విచ్చేసిన ట్రంప్ మరలా అమెరికాకు తిరిగి ప్రయాణమయ్యారు. అయితే ఈ పర్యటనలో భాగంగా తాజ్ మహల్ ని సందర్శించిన ట్రంప్ కుటుంబం, తాజ్ అందాలకు ముగ్ధులై అక్కడ కొన్ని ఫోటోలు కూడా దిగారు.ఇవాంకా ట్రంప్ కూడా తాజ్ ముందు నిలబడి ఫొటోలకు ఫోజిచ్చారు. ‘తాజ్ మహల్ వైభవం, అందం అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది’ అంటూ ఇవాంకా తన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు కూడా చేశారు. దింతో ఆమె ఫాలోవర్లు లైక్ లు కొట్టారు, తాజ్ అందాలను పొగుడుతూ.. కామెంట్స్ చేశారు. ఇలా ఇన్ స్టాగ్రామ్‌ లో పోస్టు చేసిన కొద్దిసేపటికే ఆమె ఫొటోపై కామెంట్ల వర్షం కురిసింది.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆమె ఫోటోలపై కొంతమంది నెటిజన్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆమె దిగిన ఫోటోలు ఓరినాల్ కాదని, అవి ఫోటో షాప్ లో ఎడిట్ చేసిన ఫోటోలని కామెంట్లు పెట్టారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. తాజ్ మహల్ ముందు ఉన్న వాటర్ ఫుల్ లో నీరు, ఫోటోలో ఇవాంకా ట్రంప్ వెనుక ఉన్న నీరు ఒకేలా లేవు. అదే విధంగా.. ఆమె ఫొటోలో ఉన్న నీరు రెండు రకాలుగా కనిపించాయి. ఇవాంకా ఎడమ చేతి మధ్యలో ఉన్న ప్రాంతంలో కనిపించే నీరు.. ఇరువైపులా ఉన్న నీటి కంటే స్పష్టంగా ఉన్నట్లు కనిపిస్తోంది’

ఇవాంకా ఫొటోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు.. “ట్రంప్ కుమార్తె ఇవాంకా ఫొటోను ఎడిటింగ్ చేశారు” అంటూ కామెంట్లు పెట్టారు. ‘ఆమె తన నడుమును చిన్నదిగా చేసింది’ అని ఒక వ్యక్తి ట్విట్టర్‌లో కామెంట్ పెట్టాడు. ’ఆమె నడుము చేయి మధ్య నీటిని చూడండి. ఇది పక్కనే ఉన్న నీటి కంటే రంగు ఆకృతి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తోంది ’ అని మరొకరు ట్వీట్ చేశాడు. పూర్తి పూల్ నీటిని బ్లర్ చేయండి.. లేదా ఇవాంకా నడుము / చేయి అంతరాన్ని క్రమబద్ధీకరించండి.. లేదంటే ఆమె నడుమును ఫొటోషాప్‌ లో ఎడిటింగ్ చేశారని మేము అనుకోవచ్చు’ అని మరొక వ్యక్తి ట్వీట్ చేశాడు.

ఇవాంకా ట్రంప్ ఫోటోలు మాత్రమే ఇలా మార్ఫింగ్ చేశారా లేక ట్రంప్ కుటుంబ ఫోటోలన్ని ఈ రీతిగానే మార్ఫింగ్ చేశారా? అనే అనుమానాలు అనేకమంది నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.