ఆంధ్రప్రదేశ్రాజకీయాలు

బాబాయ్ సుబ్బారెడ్డికి జగన్ ఎసరు..?

టీటీడీ పదవి కొనసాగేనా..?

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పదవుల పంపకం విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు. ఒక్కోసారి బంధువులైనా సరే తాను తీసుకునే నిర్ణయంలో ఎవరి మాటా వినడం. తాజాగా ఆయన బాబాయ్ సుబ్బారెడ్డి విషయంలో కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తున్నాడా..? అన్న చర్చ సాగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా సుబ్బారెడ్డి పదవీ కాలం రెండేళ్లు పూర్తయి రెండో రోజులవుతోంది. అయితే ఇప్పటి వరకు ఆయన పదవి రెన్యూవల్ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు. దీంతో ఆయన మరోసారి టీటీడీ చైర్మన్ గా కొనసాగుతారా..? లేదా..? అనేది ఆసక్తిగా మారింది.

టీటీడీ చైర్మన్ ప్రతీ ఏడాదికోసారి మారుతారు. కానీ సుబ్బారెడ్డి నుంచి జంబో వ్యవధిను ఏర్పాటు చేశారు. అంటే సుబ్బారెడ్డి రెండేళ్లు పదవీలో ఉన్నారు. ప్రస్తుతం సుబ్బారెడ్డి మాజీ చైర్మన్. అంతేకాకుండా పాలక మండలి సైతం పాతదైపోయింది. దీంతో బోర్డు సభ్యుల సిఫారసులు పనిచేయడం లేదు. సుబ్బారెడ్డి స్వయాన సీఎం బాబాయ్ కనుక ఆయనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కొన్ని కార్యాకలాపాల్లో ఆయన పాలు పంచుకున్నా పట్టించుకోవడం లేదు. అయితే బయటి నుంచి మాత్రం విమర్శలు వస్తున్నాయి.

గతంలో సుబ్బారెడ్డి ఎంపీగా ఉండేవారు. అయితే ఆయన స్థానంలో మాగుంటకు అవకాశం ఇచ్చి బాబాయ్ ని తప్పించారు. అయితే టీటీడీ చైర్మన్ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారు. దీంతో రెండేళ్లు ఆయన పదవిని అనుభవించారు. కానీ ప్రస్తుతం ఆయన చైర్మన్ పదవిపై రకరకాల అనుమానాలు వస్తున్నాయి. అయితే సుబ్బారెడ్డి మాత్రం జగన్ తనకే అవకాశం ఇస్తారని అంటున్నారు. దీంతో ఆయనకు చైర్మన్ పదవి లేకున్నా కొందరు ఆయన మాటను జవదాటటం లేదు.

ఇక జగన్ ప్రభుత్వం మాత్రం ఈసారి క్షత్రియులకు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. రఘురామ రాజు విషయంలో ప్రభుత్వంపై క్షత్రియులు కొంత అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. దీంతో వారి వర్గంలో టీటీడీ చైర్మన్ పదవి ఇస్తే సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నారట. దీంతో సుబ్బారెడ్డికి మరోసారి అవకాశం లేనట్లేనని అంటున్నారు. అయితే సుబ్బారెడ్డిని కొనసాగించే విషయమే ఉంటే పదవీకాలం ముగిసే రెండు రోజుల ముందే ఉత్తర్వులు వచ్చేవి కదా..? అని కొందరు అనుకుంటున్నారు.

Back to top button