ఆంధ్రప్రదేశ్గుసగుసలురాజకీయాలు

జగన్ రాడట.. వైసీపీ ఎమ్మెల్యేలకు భారీ టార్గెట్

Jagan is absent .. a huge target for YCP MLAs

ఏపీ ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న తిరుపతి ఉప ఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది. అధికార వైసీపీ అభ్యర్థిగా మద్దెల గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మీ, బీజేపీ-జనసేనల నుంచి రత్నప్రభ బరిలో ఉండునున్నారు. ఇక కాంగ్రెస్, వామపక్షాలు కూడా తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో వైసీపీ జోరుమీద ఉండడంతో ఇక్కడ  గెలుపు సనాయాసమేనన్న వాదన వినిపిస్తోంది. అయితే టీడీపీ, బీజేపీలు మాత్రం తీవ్రంగా ఓ విషయంపై చర్చించుకుంటున్నారట. ఆ విషయమేంటంటే..?

తిరుపతి ఉప ఎన్నికలో విజయంపై విశ్వాసం లేకపోయినా ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయోనని టీడీపీ, బీజేపీలు లెక్కలు వేసుకుంటున్నారట. ముఖ్యంగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న పనబాక లక్ష్మీ తనకు గెలుస్తానని నమ్మకం లేకున్నా వచ్చే ఎన్నికల నాటికి తనకే టికెట్ ఇవ్వాలన్న ధీమాతోనే పోటీ చేస్తున్నానని సన్నిహితుల వద్ద వాపోయిందట. ఇక కార్యకర్తలు కూడా ఓ రకంగా హ్యాపీగానే ఉన్నారట. ఎందుకంటే ఇక్కడ ఎలాగూ వైసీపీ గెలుస్తుందన్న భావనతో పెద్దగా పోరాడాల్సిన పని లేదు అని అనుకుంటున్నారట. మా ఓట్లు మాకు వస్తే చాలు.. ఓట్ల కోసం గడ్డాలు పట్టుకోవడం.. బతిమిలాడడం వంటివి చేయాల్సిన అవసరం లేదని చర్చించుకుంటున్నారట.

ఇదిలా ఉండగా ఇప్పుడు తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో తిరుపతిలో  భూమన కరుణాకర్ రెడ్డి, శ్రీకాళహస్తిలో మధుసుధన్ రెడ్డి, సత్యవేళ్లలో ఆదిమూలం, సూళ్లురుపేటలో అంజయ్య, వెంకటగిరిలో ఆనం రామనారాయణరెడ్డి, గూడూరులో వరప్రసాదరావు, సర్వేపల్లిలో కాకాని గోవర్ధన రెడ్డి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి జగన్ ఓ భారీ బాధ్యతను అప్పగించారట. తిరుపతి ఎంపీ ఎన్నికల్లో 5 లక్షల మెజారిటీతో గురుమూర్తిని గెలిపించాలి అని ఆదేశాలు జారీ చేశారట. ఇక్కడ గెలుపు సాధారణమే.కానీ దేశం మొత్తం తమ వైపు చూసేలా భారీ మెజారిటీతో గెలిపించాలని అని ఆదేశించారట.

జగన్ ఇంత భారీ టార్గెట్ ఇవ్వడంతో వైసీపీ ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నారట. జగన్ ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఒక్కో నియోజవర్గం నుంచి 70 వేల మెజారిటీ రావాలి. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తాడిపత్రి మినహా అంతటా వైసీపీనే గెలిచింది. అయితే అంతకుముందు ఇలాగే ఎమ్మెల్యేలకు జగన్ టార్గెట్ ఇచ్చాడట. దానికోసం నానా తంటాలు పడ్డ ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు జగన్ ఇచ్చిన టార్గెట్ తో సతమతమవుతున్నారట. ఇక ఇక్కడి ప్రచారానికి జగన్ రావడం లేదట. ఎందుకంటే నేను ఎక్కడున్నా మా పార్టీ అభ్యర్థికి ఓట్లు పడుతాయనే సంకేతాలు ఇవ్వడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నాడట. మరి ఎమ్మెల్యేలు జగన్ ఇచ్చిన టార్గెట్ ను రీచ్ చేస్తారో లేదో చూడాలి.

Back to top button