ఆంధ్ర బ్రేకింగ్ న్యూస్
సోషల్ మీడియా ట్రెండింగ్ లో జగన్ 2వ స్థానం
Jagan ranks 2nd in social media trending
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. సోషల్ మీడియాలో అత్యంత ప్రజాధరణ కలిగిన వ్యక్తుల్లో జగన్ రెండో స్థానం పొందాడు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఆగష్టు నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా ట్రెండ్స్ ను చెక్ బ్రాండ్ సంస్థ విడుదల చేసింది. ఈ సంస్థ వివరాల ప్రకారం 2,171 ట్రెండ్స్ తో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మొదటి స్థానంలో ఉన్నారు. 2,137 ట్రెండ్స్ తో ఏపీ సీఎం రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత స్థానంలో మమతా బెనర్జీ, రాహుల్, సోనియా గాంధీలు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు, ఇతర కార్యక్రమాల ద్వారా జగన్ నిత్యం సోషల్ మీడియాలో ట్రండ్ అవుతున్నారు.