ఆంధ్రప్రదేశ్విద్య / ఉద్యోగాలు

ఏపీ విద్యార్థులకు జగన్ సర్కార్ మరో శుభవార్త..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాలిటెక్నిక్ చేరాలనుకునే విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రైవేట్ పాలిటిక్నిక్ కాలేజీల్లో కొత్తగా ఐదు డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టడానికి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2020 – 2021 విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు సీఎస్సీ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), ప్యాకేజింగ్ టెక్నాలజీ, యానిమేషన్ -మల్టీమీడియా టెక్నాలజీ, వెబ్ డిజైనింగ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది.

ఈ కొత్త కోర్సుల వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ ఈ సంవత్సరం నుంచే కొత్త కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నట్టు ఉత్తర్వులను విడుదల చేసింది. ఎస్‌ఎస్‌సీ లేదా తత్సమాన పరీక్షల్లో పాస్ అయిన అభ్యర్థులు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు. ఈ కోర్సుల వ్యవధి మూడు సంవత్సరాలు కాగా పాలీసెట్ పరీక్ష రాసి అర్హత పొందాల్సి ఉంటుంది.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ది, శిక్షణా శాఖ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో వెబ్ డిజైనింగ్, యానిమేషన్ మల్టీమీడియా టెక్నాలజీ, 3డీ యానిమేషన్ గ్రాఫిక్స్ డిప్లొమా కోర్సులకు సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కు అనుమతులు లభించాయి. రాజానగరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ ఫర్ ఉమెన్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుకు అనుమతులు లభించాయి.

కోరంగి ప్రాంతంలోని కిమ్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ కు 3డీ యానిమేషన్ గ్రాఫిక్స్ కోర్సుకు అనుమతులు లభించాయి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ప్రాంతంలోని కిమ్స్ కాలేజీకి ప్యాకేజింగ్ టెక్నాలజీలో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టటానికి అనుమతులు లభించాయి.

Back to top button