సినిమాహాలీవుడ్

బాండ్.. జేమ్స్ బాండ్.. ఇకలేరు

Sean Connery
ప్రపంచ సినిమా చరిత్రలో జేమ్స్ బాండ్ సినిమాలకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచస్థాయిలో ప్రేక్షకులను బాండ్ సినిమాలు ప్రభావితం చేసినంతగా మరే సిరీస్ ప్రభావితం చేయలేదు. పెద్దవాళ్ళ నుండి చిన్నపిల్లల వరకు ఎవరైనా సరే జేమ్స్ బాండ్ అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. చేతిలో తుపాకీ, నల్లని సూటూబూటూ, క్లీన్ షేవ్ లుక్, హ్యాండ్సమ్ లుక్, అసామాన్యమైన సాహసాలు, మెరుపులాంటి వేగం ఇలా చెప్పుకుంటూ పొతే బాండ్ పాత్రల గొప్పతనాలు ఎన్నో. అంతలా ఆలరించిన ఈ బాండ్ సిరీస్లో మొదటిసారి బాండ్ పాత్రలో కనిపంచింది మాత్రం సీన్ కానరీ.

Also Read: సింగిల్ సిట్టింగ్లో పవ‌న్‌ చేత ఓకే చెప్పించుకున్న దర్శకుడు

ఈ స్కాటిష్ నటుడు 1962 లో వచ్చిన ‘డాక్టర్ నో’ చిత్రంలో బాండ్‌గా కనిపించి అలరించారు. ఆయన మూలానే బాండ్‌ సినిమాలు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత 1963లో వచ్చిన ‘ఫ్రమ్ రష్యా విత్ లవ్’, 1964లో వచ్చిన ‘గోల్డ్ ఫింగర్’, 1965లో ‘థండర్‌బాల్’, 1967లో వచ్చిన ‘యూ ఓన్లీ లివ్ ట్వైస్’, 1971లో ‘డైమండ్స్ ఆర్ ఫరెవర్’, 1983లో వచ్చిన ‘నెవర్ సే నెవర్ ఎగైన్’ లాంటి బాండ్ సినిమాల్లో సీన్ కానరీయే బాండ్ పాత్రధారి. ఆయన తర్వాత ఎంతోమంది నటులు బాండ్ పాత్రలు చేసినా సీన్ కానరీ ఆకట్టుకున్నట్టు ఆకట్టుకోలేకపోయారు.

Also Read: కెవ్వు కార్తీక్ కథ ఎమోషనల్.. నెట్టింట్లో వైరల్..

బాండ్ సిరీస్ అభిమానుల్ని ఎవ్వర్ని అడిగినా బెస్ట్ బాండ్ అంటే సీన్ కానరీ పేరే చెబుతారు. అలాంటి గొప్ప నటుడు 90 ఏళ్ల వయసులో అనారోగ్యంతో నిన్న కన్నుమూశారు. ఆయన మరణవార్త తెలిసీ హాలీవుడ్ ప్రేక్షకులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా విచారానికి లోనవుతున్నారు. అలాంటి గొప్ప నటుడ్ని మళ్ళీ చూడలేమని అంటున్నారు. కేవలం బాండ్ సినిమాల్లోనే కాదు ఆతర్వాత అనేక మంచి చిత్రాల్లో నటించిన సీన్ కానరీ ఆస్కార్ అవార్డు కూడ అందుకున్నారు. అలాగే 2006లో అమెరికన్‌ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌ నుంచి జీవిత సాఫల్య పురస్కారంతో పాటు రెండుసార్లు గోల్డెన్ గ్లొబ్ అవార్డును అందుకున్నారు.

Back to top button