బాలీవుడ్సినిమా

ఒకే రోజు రెండు కట్ చేస్తానంటుంది !

Janhvi-Kapoor
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ నెల 6వ తేదీన తన 24వ పుట్టిన రోజు జరుపుకోబోతుంది. కాకపోతే, తానూ 24లోకి అడుగు పెడుతున్నా, తను మాత్రం 23వ బర్త్ డేనే సెలెబ్రేట్ చేసుకుంటుందట. ఎందుకమ్మా అలా అంటే.. గతేడాది కరోనా కారణంగా తన 23వ బర్త్ డేని సరిగ్గా సెలెబ్రేట్ చేసుకోలేక, ఇల్లు దాటలేక, ముఖ్యంగా తన ఫ్రెండ్స్ కి పెద్ద పార్టీ ఇవ్వలేక అమ్మడు తెగ ఫీల్ అయిపోయిందట. ఆ ఫీలింగ్స్ ను ఎందుకు వేస్ట్ చేయడం, అందుకే ఈ సారి తన ఫ్రెండ్స్ కి పెద్ద పార్టీ ఇచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేస్తానంటుంది.

Also Read: భయపడ్డ స్టార్ హీరో.. ఇక మహాభారతం రాదు !

మరి 24వ బర్త్ డే ఎప్పుడు చేసుకుంటుంది అనుకుంటున్నారా ? అందుకే, ఈ 24వ బర్త్ డే నాడే 23, 24 పేర్లతో ఇలా రెండు కేకులు కట్ చేసి రెండు పుట్టినరోజులను ఒకే రోజు చేసుకుంటుందట. మొత్తనికి ఈ సారి ఫ్రెండ్స్ అందరికి పెద్ద పార్టీ ఇచ్చి ధూమ్ ధామ్ గా పుట్టినరోజును జరుపుకోవాలని జాన్వీ ఫిక్స్ అయినట్టు ఉంది. అసలు జాన్వీ కపూర్ పార్టీ గాళ్ అని. ఆమె పార్టీలు చేసుకోవడం, పార్టీల్లో డాన్స్ చెయ్యడం అనేది ఆమెకు సర్వసాధారణం అనే పేరు ప్రఖ్యాతలను తక్కువ టైంలోనే సంపాధించింది ఈ యంగ్ బ్యూటీ.

Also Read: రిపీట్ అవుతున్న కాంబో.. స‌క్సెస్ రిపీట్ అవుతుందా?

ఏది ఏమైనా తల్లి అతిలోక సుందరి కావడంతో.. జాన్వి కపూర్ కు ఇండస్ట్రీలో ఎలాంటి కష్టాలు లేకుండానే స్టార్ డమ్ వచ్చేసింది. పైగా స్టార్ డమ్ తో పాటు వరుసగా అవకాశాలు వస్తున్నాయి. దాంతో అమ్ముడుకి ఆ స్టార్ డమ్ తాలూకు బాధ్యత తెలియడం లేదు అనే విమర్శలు కూడా ఎదురుకుంటుంది. ఏమైనా శ్రీదేవి అందంతో పోల్చలేము గాని, సెక్సీగా ఫోజులివ్వడంలో.. తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ మతులను పోగొట్టడంలో జాన్వీ కూడా తల్లికి తనయ అనే అనిపించుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

Back to top button