అత్యంత ప్రజాదరణక్రీడలుజాతీయంరాజకీయాలు

4వ టెస్టుకు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ

jasprit bumrah not playing the final test

jasprit bumrah

ఆస్ట్రేలియా పర్యటన భారత్ కు కలిసిరావడం లేదు. ఏదో విధంగా టీమిండియాకు దెబ్బపడుతూనే ఉంది. ఆస్ట్రేలియా పర్యటన మొదలైనప్పటి నుంచి ఆటగాళ్లను గాయాల బెడద వేధిస్తోంది. వరుసగా టీమిండియా క్రికెటర్లు గాయాల బారినపడుతున్నారు.

Also Read: తండ్రి అయిన విరాట్ కోహ్లీ.. తొలి సంతానం ఎవరంటే?

ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ తన భార్య డెలివరీ కోసం భారత్ కు తిరిగి వచ్చేయగా.. కీలక బౌలర్లు మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్ తోపాటు సిడ్నీలో రవీంద్ర జడేజా, హనుమ విహారిలు గాయాల బారినపడ్డారు. ఇప్పుడు నాలుగో టెస్టుకు వీరంతా గాయాల బారిన పడి దూరమైన పరిస్థితి ఉంది.

ఈ క్రమంలోనే టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. చివరి టెస్టులో మరో కీలక పేసర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఆడటం లేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అతడికి పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Also Read: అయినా.. ఆయనకు ఇంకా బుద్ధి రాలేదు

టీమిండియా తొలి టెస్టులో ఘోర ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకొని బాక్సింగ్ డే టెస్టును గెలుచుకుంది. మూడో టెస్టును వీరోచితంగా పోరాడి డ్రా చేసుకుంది. ఓడిపోతామనుకున్న మ్యాచ్ లో హనుమ విహారి, అశ్విన్ చివరి వరకు వికెట్లు కాపాడుకొని అసీస్ విజయానికి అడ్డుగోడలా నిలబడ్డారు.

ఇప్పుడు జడేజా, పంత్ గైర్హాజరీలో టీమిండియా ఎలాంటి ప్రదర్శన చేస్తుంది..? 4 వ టెస్టుపై దీని ప్రభావం ఏంటనేది భారత అభిమానులను కంగారు పెడుతోంది. టీమిండియా పేస్ దళాన్ని నడిపించే బుమ్రానే లేకపోవడం పెద్ద లోటుగా మారింది. బుమ్రా లేకపోతే బౌలింగ్ బలహీనమవుతుందనే ఆందోళన నెలకొంది.

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

Back to top button